Rohit Sharma: వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆడతాడా..? హిట్‌మ్యాన్ అసలు క్లారిటీ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో ఆడటంపై టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హిట్‌మ్యాన్.. ప్రేక్షకులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది అక్టోబర్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో ఆడతారా? లేదా? అని ఓ అభిమాని ప్రశ్నించగా.. రోహిత్ ఆసక్తికరంగా స్పందించారు. 2027 అక్టోబర్‌కు ఇంకా చాలా సమయం ఉంది. దాని గురించి అప్పుడు చూద్దామని రోహిత్ బదులిచ్చారు. వన్డే ప్రపంచకప్‌కు ఇంకా 13 నెలల సమయం ఉండటంతో.. ఈలోగా ఫామ్, ఫిట్‌నెస్ పరంగా ఏమైనా జరగొచ్చని, భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఎవరూ చెప్పలేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వివరాలు
వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్
గత కొంతకాలంగా రోహిత్ శర్మపై పక్షపాత ధోరణి చూపిస్తున్నారనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇచ్చిన తాజా సమాధానం ప్రాధాన్యం సంతరించుకుంది.
గతేడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడంతో.. అతడి అంతర్జాతీయ భవిష్యత్తుపై ఆందోళనలు, ఊహాగానాలు మొదలయ్యాయి.
రోహిత్ తాజా ప్రకటనను పరిశీలిస్తే.. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌లో ఆడటంపై అతడు ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
ప్రస్తుతం రోహిత్ టెస్టు, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి.. వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు.
వన్డేల్లో కెప్టెన్సీ నుంచి అసాధారణ రీతిలో తొలగించిన నేపథ్యంలో రోహిత్ భవిష్యత్తుపై అప్పటినుంచి ఊహాగానాలు మొదలయ్యాయి.
వివరాలు
రోహిత్ భవిష్యత్తుపై బీసీసీఐ కార్యదర్శి స్పందన
వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. అయితే ఈ మెగా టోర్నీలో రోహిత్ శర్మ ఆడతాడా? లేదా?అనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు.
రోహిత్ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలపై గతంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కూడా స్పందించారు.
రోహిత్ అద్భుతంగా ఆడుతున్నప్పుడు ఇక ఎలాంటి కన్ఫ్యూజన్ ఎందుకని ఆయన ప్రశ్నించారు. తప్పుడు వార్తలపై తాను స్పందించనని కూడా తెలిపారు.
రోహిత్ ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. అంతేకాకుండా ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నాడు.
గత మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు.
అనంతరం జులైలో జరిగిన వన్డే మ్యాచ్ రోహిత్‌కు చివరి మ్యాచ్ అవుతుందనే ప్రచారం జరిగింది.
వివరాలు
'నాన్ కమిటల్' టీ-షర్టుతో రోహిత్.. చర్చకు దారితీసిన వ్యవహారం
దీంతో బీసీసీఐ కార్యదర్శి చివరికి స్పందించాల్సి వచ్చింది. తన కెరీర్‌పై ఎన్ని ఊహాగానాలు వచ్చినప్పటికీ రోహిత్ మాత్రం వాటిపై స్పందించకుండా సైలెంట్‌గా ఉన్నాడు.
మరోవైపు రోహిత్ శర్మ త్వరలో ప్రైమ్‌టైమ్ టెలివిజన్‌లో 'ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ' అనే రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు.
త్వరలో ప్రసారం కానున్న ఈ షో టీజర్ ప్రోమో కోసం రోహిత్ ధరించిన టీ-షర్టు కూడా ఇప్పుడు చర్చకు దారితీసింది.
ఆ టీ-షర్టు ముందు భాగంలో 'నాన్ కమిటల్ అనే పదాలు స్పష్టంగా కనిపించాయి.
రోహిత్ వన్డే ప్రపంచకప్‌లో ఆడటంపై తాజాగా చేసిన వ్యాఖ్యలకు, ఈ టీ-షర్టుపై ఉన్న పదాలకు సంబంధం ఉందా? అనే చర్చ కూడా మొదలైంది.