Page Loader
వింబుల్డన్‌ 2023 : క్వార్టర్స్ లోకి దూసుకెళ్లిన ఎలీనా విటోలినా.. అజరెంకాపై ఉత్కంఠ గెలుపు
క్వార్టర్స్ చేరిన ఎలినా స్విటోలినా

వింబుల్డన్‌ 2023 : క్వార్టర్స్ లోకి దూసుకెళ్లిన ఎలీనా విటోలినా.. అజరెంకాపై ఉత్కంఠ గెలుపు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 10, 2023
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ వింబుల్డన్‌లో మహిళల సింగిల్స్ టెన్నిస్ క్రీడాకారిణి ఎలీనా విటోలినా క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌ టోర్నీలో విక్టోరియా అజరెంకాతో తలపడ్డ ఎలినా 7-6 (11-9) గెలుపొందింది. ఒక దశలో ఆట టై బ్రేక్‌కు వెళ్లడంతో మూడో సెట్‌ హోరాహోరీగా సాగింది.ఈ క్రమంలోనే ఇద్దరు స్టార్లు విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. విక్టోరియా అజరెంకా బెలారస్ టెన్నిస్ ప్లేయర్ కాగా ఎలీనా విటోలినా ఉక్రెయిన్ దేశానికి చెందిన క్రీడాకారిణి. గత కొద్దికాలంగా రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని మాస్కో ప్రత్యేక సైనిక చర్యగా గుర్తిస్తోంది.ఇరు దేశాల యుద్ధం నేపథ్యంలో బెలారస్‌ వ్యూహాత్మకంగా రష్యాకు మద్ధతిచ్చింది. ఈ మేరకు కీలక మ్యాచ్ లో ఉక్రెయిన్ స్టార్ ఎలీనా విజయదుందుభి మోగించడం విశేషం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విజయోత్సాహంలో ఎలీనా విటోలినా