సౌతాఫ్రికాపై శ్రీలంక సంచలన విజయం
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ లో సౌతాఫ్రికాపై శ్రీలంక సంచలన విజయం నమోదు చేసింది. శుక్రవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో శ్రీలంక జట్టు 3 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 129 పరుగులను చేసింది. శ్రీలంక ఓపెనర్ హరిత మాధవి (8) విఫలం కాగా.. కెప్టెన్ ఆటపట్టు (58బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 68) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. విష్మి గుణరత్నే 35 పరుగులతో రాణించింది. సఫారీ బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, మరిజన్నే కాప్, నదిన్ డి క్లెర్క్ తలో వికెట్ తీశారు.
మూడు వికెట్లను తీసిన శ్రీలంక బౌలర్ రణవీర
లక్ష్య చేధనకు దిగిన సౌతాఫ్రికా.. శ్రీలంక స్పిన్ ధాటికి విలవిలాడింది. 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులను చేసి ఓటమిపాలైంది. సౌతాఫ్రికా కెప్టెన్ సునే లూస్ (28), ఓపెనర్ లౌరా వోల్వార్డట్ (18) టాప్ స్కోరర్లుగా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో రణవీర 3 వికెట్లు పడగొట్టాడు. ఆటపట్టు 107 టీ20 మ్యాచ్‌ల్లో 2249 పరుగులు చేసింది. ఇందులో మొత్తం ఆరు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ ఉంది. పరుగుల పరంగా ఇంగ్లాండ్‌కు చెందిన డేనియల్ వ్యాట్‌ను ప్రస్తుతం ఆమె సమం చేసింది. శ్రీలంక ఎడమచేతి వాటం స్పిన్నర్ రణవీర నాలుగు ఓవర్లలో 3 వికెట్లను పడగొట్టింది. ఇప్పటివరకూ 63 మ్యాచ్‌లు ఆడి 71 వికెట్లను తీసింది.