LOADING...
Mohan Bhagwat: పదవి కాదు పని ముఖ్యం.. రిటైర్మెంట్‌పై చీఫ్‌ భాగవత్‌ కీలక వ్యాఖ్యలు
పదవి కాదు పని ముఖ్యం.. రిటైర్మెంట్‌పై చీఫ్‌ భాగవత్‌ కీలక వ్యాఖ్యలు

Mohan Bhagwat: పదవి కాదు పని ముఖ్యం.. రిటైర్మెంట్‌పై చీఫ్‌ భాగవత్‌ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 08, 2026
02:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

తన పదవీ విరమణపై ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వయసుతో సంబంధం లేకుండా పని కొనసాగించాలని సంఘ్‌ తనను కోరిందని తెలిపారు. ఒ కవేళ బాధ్యతల నుంచి దిగిపోవాలని ఆదేశిస్తే వెంటనే వైదొలగేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ముంబయిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆరెస్సెస్‌ చరిత్రలో ఇప్పటివరకు ఎవరినైనా బలవంతంగా పదవీ విరమణ చేయించిన సందర్భమే రాలేదని చెప్పారు. 'ఆరెస్సెస్‌ చీఫ్‌ పదవికి ఎన్నికల ప్రక్రియ ఉండదు. రీజినల్‌, డివిజనల్‌ స్థాయి అధిపతులే సర్‌సంఘ్‌చాలక్‌ను నియమిస్తారు. సాధారణంగా 75 ఏళ్లు పూర్తైన తర్వాత ఎలాంటి పదవిలో లేకుండా సేవ చేయాలని సంఘ్‌ సంప్రదాయం. నాకు ఇప్పటికే 75 ఏళ్లు నిండాయి.

Details

పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధమే

ఈ విషయాన్ని సంఘ్‌ పెద్దలకు తెలియజేశాను. అయితే, యథావిధిగా కొనసాగాలని వారు కోరారు. ఎప్పుడైనా పదవి నుంచి తప్పుకోవాలని చెప్పితే సిద్ధంగా ఉన్నాను. కానీ, పని నుంచి మాత్రం ఎప్పటికీ విరమణ ఉండదని మోహన్‌ భాగవత్‌ వ్యాఖ్యానించారు. స్వయంసేవకుల నుంచి చివరి రక్తపు బొట్టు వరకు సంఘ్‌ పని చేయించుకుంటుందంటూ ఆయన సరదాగా వ్యాఖ్యలు చేశారు. అదే కార్యక్రమంలో పలు జాతీయ అంశాలపై కూడా భాగవత్‌ స్పందించారు. వీర్‌ సావర్కర్‌కు భారతరత్న పురస్కారం అందిస్తే ఆ అవార్డు ప్రతిష్ఠ మరింత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Details

సంస్కారాలను పెంపొందించడమే సంఘ్‌ ప్రధాన లక్ష్యం

భారత్‌-అమెరికాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం దేశ ప్రయోజనాలకు నష్టం కలిగించకుండా జరిగినట్లే తనకు అనిపిస్తోందని తెలిపారు. 'ఉమ్మడి పౌరస్మృతి' అంశంపై మాట్లాడుతూ, అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకొని దానిని రూపొందించాలని, అది సమాజంలో విభేదాలకు దారితీయకూడదని స్పష్టం చేశారు. ప్రచారం చేయడం ఆరెస్సెస్‌ పని కాదని, సంస్కారాలను పెంపొందించడమే సంఘ్‌ ప్రధాన లక్ష్యమని మోహన్‌ భాగవత్‌ అన్నారు.

Advertisement