LOADING...
క్రిస్టియన్ ఎరిక్సన్ గాయం కారణంగా టోర్నికి దూరం
కొన్ని నెలల పాటు ఆటకు దూరం కానున్న ఎరిక్సన్

క్రిస్టియన్ ఎరిక్సన్ గాయం కారణంగా టోర్నికి దూరం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 01, 2023
10:54 am

ఈ వార్తాకథనం ఏంటి

మిడ్ ఫీల్డర్ క్రిస్టియన్ ఎరిక్సన్ గాయంపై మాంచెస్టర్ యునైటెడ్ బుధవారం కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ చివరి వరకు లేదా మే టోర్నికి దూరంగా ఉంటాడని తెలిపింది. యునైటెడ్ FA కప్ వర్సెస్ రీడింగ్ మ్యాచ్ సందర్భంగా ఎరిక్సన్ చీలమండ గాయంతో బాధపడిన విషయం తెలిసిందే. ఎరిక్సన్ మిడ్ ఫీల్డ్ లో అద్భుతంగా రాణిస్తాడని నమ్మకం ఉంది. యునైటెడ్ అతనిపై ఆధారపడి ఉంది. టోర్నికి ఎరిక్సన్ దూరం కావడంతో యునైటెడ్‌ కు బిగ్ షాక్ తగిలింది. యునైటెడ్ సీజన్‌లో తన సహచర మిడ్‌ఫీల్డర్ డోనీ వాన్ డి బీక్‌ను కోల్పోవడం గమనార్హం.

ఎరిక్సెన్

3నెలల పాటు ఎరిక్సెన్ ఆటకు దూరం

ఎరిక్సెన్ చాలా కాలం ఆటకు దూరంగా ఉంటాడని క్లబ్ ప్రకటన చేసింది. సీజన్ చివరి దశలో పాత్ర పోషించేందుకు క్రిస్టియన్ తిరిగి రాగలడనే నమ్మకం తమకు ఉందని, ఎరిక్సెన్ ఏప్రిల్ చివరి వరకు లేదా మే ప్రారంభం వరకు దూరంగా ఉండొచ్చని అంచనా వేశారు. తమకు మిడ్‌ఫీల్డ్ విభాగంలో మంచి ఆటగాళ్లు ఉన్నారని యునైటెడ్ మేనేజర్ ఎరిక్ టెన్ హాగ్ వెల్లడించారు. వేసవిలో ఎరిక్సెన్ యునైటెడ్‌లో ఉచిత ఏజెంట్‌గా చేరారు. అప్పటి నుండి, అతను 31 గేమ్‌లు ఆడాడు. అందులో రెండు గోల్స్ చేశాడు. ప్రీమియర్ లీగ్ 2022-23 సీజన్‌లో 7 అసిస్ట్‌లను సాధించారు.