చెత్త రికార్డు.. ఒక్క బాల్‌కు 18 పరుగులు
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు ప్రీమియర్ లీగ్ అభిమానులను అకట్టుకుంటోంది. ఈ టోర్నీలో విజయ శంకర్, నటరాజన్, సాయి సుదర్శన్, షారుఖ్ లాంటి ప్లేయర్లు ఆడుతుండటంతో తమిళనాడు లీగ్ కు ఆదరణ పెరుగుతోంది.
ఇక ఈ తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఓ చెత్త రికార్డు నమోదైంది. మంగళవారం సేలం స్పార్టాన్స్, చెపాక్ సూపర్ గిల్లీస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
ఈ నేపథ్యంలో సేలం కెప్టెన్ అభిషేక్ తన్వార్ పరమ చెత్త బౌలింగ్‌తో వరస్ట్ రికార్డును నమోదు చేశాడు.
ఆఖరి ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చిన అభిషేక్.. 20 ఓవర్ చివరి బంతికి ఏకంగా 18 పరుగులను ఇచ్చాడు.
Details
నోబాల్స్ వేయడం నిరాశ కలిగింది
ఆఖరి ఓవర్ లో చివరి ఐదు బంతులను చక్కగా వేసిన అభిషేక్.. చివరి బంతిని వరుస పెట్టి నోబాల్స్ వేశాడు. ఆఖరికి బౌల్డ్ అయినా అంపైర్ బంతిని నోబాల్ గా ప్రకటించాడు.
మొదట నోబాల్, 6 నోబాల్, 2 నోబాల్, వైడ్, సిక్స్ ఇచ్చాడు. దీంతో ఏకంగా చివరి బంతికి 18 పరుగులు వచ్చాయి.
క్రికెట్ చరిత్రలో ఒక బంతికి 18 పరుగులు సమర్పించుకున్న తొలి బౌలర్ గా అభిషేక్ నిలిచాడు. ఈ మ్యాచులో చెపాక్ 52 పరుగుల తేడాతో గెలుపొందింది.
చివరి ఓవర్ కు పూర్తి బాధ్యత తనదేనని, ఓ సీనియర్ బౌలర్ గా నాలుగు నోబాల్స్ వేయడం నిరాశ కలిగించిందని మ్యాచ్ తర్వాత స్పార్టన్స్ కెప్టెన్ అభిషేక్ చెప్పారు.