Page Loader
McCarthy: అరంగేట్రంలోనే చెత్త రికార్డు.. ఐర్లాండ్ బౌలర్ మెక్‌కార్తీకి చేదు అనుభవం
అరంగేట్రంలోనే చెత్త రికార్డు.. ఐర్లాండ్ బౌలర్ మెక్‌కార్తీకి చేదు అనుభవం

McCarthy: అరంగేట్రంలోనే చెత్త రికార్డు.. ఐర్లాండ్ బౌలర్ మెక్‌కార్తీకి చేదు అనుభవం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 17, 2025
09:40 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐర్లాండ్ జట్టు ఫాస్ట్ బౌలర్ లియామ్ మెక్‌కార్తీకి అంతర్జాతీయ టీ20 అరంగేట్ర మ్యాచ్ పూర్తిగా మరచిపోలేని అనుభవంగా మారింది. ఆదివారం వెస్టిండీస్‌తో బ్రెడీలో జరిగిన మ్యాచ్‌లో తన తొలి టీ20లోనే అతడు రెండో అత్యంత చెత్త బౌలింగ్ ప్రదర్శనను నమోదు చేశాడు. మొత్తం నాలుగు ఓవర్లు వేసిన మెక్‌కార్తీ ఏకంగా 81 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ప్రదర్శనతో లియామ్ మెక్‌కార్తీ, అంతర్జాతీయ టీ20 చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఇదివరకే గాంబియాకు చెందిన మూసా జోబర్తే 4 ఓవర్లలో 93 పరుగులు ఇచ్చి అగ్రస్థానంలో ఉన్నాడు.

Details

ఒకే ఓవర్ లో 21 పరుగులు

జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో జోబర్తే ఆ చెత్త రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఐదో ఓవర్‌లో లియమ్ మెక్‌కార్తీకి బౌలింగ్ అప్పగించగా, మొదటి రెండు బంతుల్లో షాయ్ హోప్ రెండు సిక్సర్లు కొట్టాడు. నాలుగో ఐదో బంతుల్లో ఈవిన్ లూయిస్ రెండు ఫోర్లు బాదాడు. ఒక్క ఓవర్‌లోనే మెక్‌కార్తీ 21 పరుగులు ఇచ్చాడు. అతని రెండో ఓవర్‌లో లూయిస్ ఒక సిక్స్, మూడు ఫోర్లు కొడితే, చివరి బంతికి షాయ్ హోప్ ఫోర్ బాదాడు. ఆ ఓవర్‌లో 24 పరుగులు వచ్చాయి.

Details

తొలి మ్యాచులోనే చేదు అనుభవం

మూడో ఓవర్‌లో మెక్‌కార్తీ 18 పరుగులు ఇచ్చాడు. చివరి ఓవర్‌లో మరో ఫోర్, రెండు సిక్సర్లు తగిలాయి. ఇలా మొత్తం నాలుగు ఓవర్లలో 81 పరుగులు ఇచ్చాడు. ఇదే మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు చెలరేగి ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి భారీగా 256 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 194 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్ లియమ్ మెక్‌కార్తీకి తొలి అవకాశంలోనే చేదు అనుభూతిని మిగిల్చింది.