మార్చి 4నుంచి 26 వరకు ముంబాయిలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్
మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలోని రెండు వేదికలపై ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ మొత్తాన్ని ఆడేందుకు భారత క్రికెట్ బోర్డు యోచిస్తోందని క్రిక్‌బజ్ తెలిపింది. డివై పాటిల్, సీసీఐ స్టేడీయాలు వేదిక కానున్నాయి. ఇందులో మొదటి మ్యాచ్ ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ యాజమన్యాల జట్లు అయినా ముంబై, అహ్మదాబాద్ మధ్య మార్చి 4న డివై పాటిల్ స్టేడియంలో జరగనుంది. మార్చి 5న బెంగళూరు, ఢిల్లీ జట్ల మధ్య జరిగే రెండో మ్యాచ్‌కు CCI స్టేడీయం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే ఒప్పందాలపై సంతకాలు చేయడానికి ఐదుగురు ఫ్రాంచైజీ జట్టు యజమానులు శుక్రవారం ముంబైలో సమావేశమయ్యారు. చివరి నిమిషంలో ఏవైనా మార్పులు చేసుకున్న తర్వాత, ఈ ఒప్పందం ముగియనుంది.
మహిళా జట్ల ద్వారానే ఎక్కువ ఆదాయం
పాయింట్ల పట్టికలో మొదటి మూడు స్థానాల్లో ఉన్న జట్లు ప్లే ఆఫ్ కు చేరుకుంటాయి. లీగ్ లో అగ్రస్థానంలో ఉన్న జట్టు నేరుగా ఫైనల్ కి అర్హత సాధిస్తుంది. రెండు, మూడు స్థానంలో ఉన్న జట్లు మార్చి 24న సీసీఐ స్టేడియంలో జరిగే ఫైనల్‌లో స్థానం కోసం పోరాడేందుకు తలపడతాయి. మార్చి 26న డివై పాటిల్ స్టేడియంలో ఫైనల్ జరగనుంది. 2008లో ఐపీఎల్ జట్ల వేలం నిర్వహించినప్పటికంటే మహిళా జట్ల ద్వారా మరింత ఎక్కువ ఆదాయం సమకూరిందని బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా తెలిపారు. ఐదు జట్లకు నిర్వహించిన వేలం ద్వారా రూ.4669.99 కోట్లు బీసీసీఐకి దక్కాయి.