WPL 2026 Auction: ఇవాళ డబ్ల్యూపీఎల్ 2026 వేలం.. ఇద్దరు భారత స్టార్‌లపై ఫ్రాంచైజీల పోటీ!
ఈ వార్తాకథనం ఏంటి
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ మినీ వేలానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశ రాజధాని న్యూదిల్లీ వేదికగా ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు వేలం ప్రారంభం కానుండగా, స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. మొత్తం ఐదు ఫ్రాంచైజీల్లో ఉన్న 73 ఖాళీల కోసం 277 మంది మహిళా క్రికెటర్లు పోటీపడుతున్నారు.
Details
ప్లేయర్ల సంఖ్య - కేటగిరీలు
మొత్తం 194 భారత ఆటగాళ్లలో 52 మంది క్యాప్‌డ్, 142 మంది అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు ఉన్నారు. విదేశీ క్రికెటర్లలో 66 మంది క్యాప్‌డ్, 17 మంది అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు దాఖలయ్యారు. విదేశీ ఆటగాళ్లు మొత్తం 23 స్లాట్‌ల కోసం పోటీ పడనున్నారు. ఒక్కో జట్టు కనీసం 15 మంది, గరిష్టంగా 18 మంది ప్లేయర్లను మాత్రమే తీసుకోవాలి.
Details
మార్క్యూ ప్లేయర్లపై భారీ డిమాండ్
డబ్ల్యూపీఎల్ 2026 వేలంలో పలు స్టార్ క్రికెటర్లపై ఫ్రాంచైజీలు భారీగా బిడ్ వేయనున్నట్లు అంచనా. ఐసీసీ 2025 మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో రాణించిన దీప్తి శర్మ, రేణుకా సింగ్‌లపై కాసుల వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే క్రాంతి గౌడ్, హర్లీన్ డియోల్, శ్రీ చరణి, ప్రతీక రావల్ వంటి యువతారలకు కూడా మంచి ధర పలికే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే విధంగా స్నేహ్ రాణా, పూజ వస్త్రకర్‌లకు కూడా జట్ల మధ్య పోటీ నెలకొనవచ్చు.
Details
విదేశీ స్టార్‌లు - మరింత హాట్
విదేశీ క్రికెటర్లలో సోఫీ డివైన్, అమేలియా కెర్, ఎక్లెస్టోన్, మెగ్ లాన్నింగ్, లారా వోల్వార్డ్ట్, అలిస్సా హీలీ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లకు పెద్ద డిమాండ్ ఉండనుంది. జట్ల పర్స్ స్థితి - ఎవరికెంత డబ్బు? యూపీ వారియర్స్ వద్ద అత్యధికంగా రూ.14.5 కోట్లు పర్స్ ఉంది. గుజరాత్ జెయింట్స్ - ₹9 కోట్లు ఆర్సీబీ - ₹6.15 కోట్లు ముంబై ఇండియన్స్ - ₹5.75 కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్ - ₹5.7 కోట్లు
Details
స్లాట్‌ల విషయానికి వస్తే—
యూపీ 17 స్లాట్‌లకు బిడ్ వేయనుంది, అందులో కనీసం 5 విదేశీ ప్లేయర్లకు అవకాశం ఉంటుంది. గుజరాత్ జెయింట్స్ వద్ద 16 స్లాట్‌లు ఉండగా ఐదుగురు విదేశీ ఆటగాళ్ల స్థానం ఖాయం. ఆర్సీబీకి 14 స్లాట్‌లు ఉండగా, కనీసం నలుగురు విదేశీ ప్లేయర్లు అవసరం. ఢిల్లీ, ముంబై ఒక్కోటి 13 స్లాట్‌లను కలిగి ఉండగా, విదేశీ ఆటగాళ్లకు నాలుగు స్లాట్‌లున్నాయి. డబ్ల్యూపీఎల్ 2026 వేలం మహిళా క్రికెట్ ప్రపంచంలో మరోసారి ఉత్కంఠ, సస్పెన్స్, భారీ బిడ్లతో రసవత్తరంగా మారనుంది.