LOADING...
WPL 2026 Mega Auction : ముగిసిన డబ్ల్యూపీఎల్ 2026 మెగా ఆక్షన్.. ఐదు జట్లు కలిసి రూ.40.8 కోట్లు ఖర్చు!
ముగిసిన డబ్ల్యూపీఎల్ 2026 మెగా ఆక్షన్.. ఐదు జట్లు కలిసి రూ.40.8 కోట్లు ఖర్చు!

WPL 2026 Mega Auction : ముగిసిన డబ్ల్యూపీఎల్ 2026 మెగా ఆక్షన్.. ఐదు జట్లు కలిసి రూ.40.8 కోట్లు ఖర్చు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2025
09:12 am

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ఉమెన్స్ ఐపీఎల్ లీగ్ (WPL) 2026 మెగా ఆక్షన్ ఘనంగా ముగిసింది. ఈసారి వేలం ఉత్సాహం అమాంతం పెరిగింది. మొత్తం 276 మంది క్రికెటర్లు రిజిస్టర్ కాగా, వారిలో కేవలం 67 మందికే జట్లలో చోటు లభించింది. ఐదు ఫ్రాంచైజీలు కలిపి రూ. 40.8 కోట్లు వెచ్చించాయి. అందులో రూ. 21.65 కోట్లు భారతీయ క్రీడాకారిణులకే కేటాయించబడడం ప్రత్యేకం. ఈ మెగా ఆక్షన్‌లో ఆకర్షణగా నిలిచింది దీప్తి శర్మ. ఆమెను UP వారియర్స్ జట్టు రూ. 3.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసి అత్యంత ఖరీదైన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిపింది.

Details

ఆక్షన్‌లో ఫ్రాంచైజీల ఖర్చు, కొనుగోలు వివరాలు

ఈ వేలంలో UP వారియర్స్ అత్యధికంగా 17 మందిని, గుజరాత్ జెయింట్స్ 16 మందిని, RCB 12 మందిని, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చెరో 11 మందిని కొనుగోలు చేశాయి. మొత్తం నమోదైన ఆటగాళ్లు: 276 జట్లలో ఎంపికైన వారు: 67 విదేశీ ఆటగాళ్లు: 23 మొత్తం ఖర్చు: రూ. 40.8 కోట్లు భారతీయులపై ఖర్చు: రూ. 21.65 కోట్లు అత్యంత ఖరీదైన ఆటగాళ్లు: దీప్తి శర్మ - రూ. 3.2 కోట్లు (UPW) అత్యధిక ఆటగాళ్లు తీసుకున్న జట్టు: UP వారియర్స్ (17 మంది)

Details

అన్ని జట్ల తుది స్క్వాడ్లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్మృతి మంధాన, రిచా ఘోష్, ఎలిస్ పెర్రీ, లారెన్ బెల్, పూజా వస్త్రకార్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, నాదిన్ డి క్లర్క్, శ్రేయాంక పాటిల్, జార్జియా వోల్, లిన్సే స్మిత్, ప్రేమ రావత్, గౌతమి నాయక్, ప్రత్యాషా కుమార్, దయాలన్ హేమలత. ముంబై ఇండియన్స్ (MI) నాట్ స్కివర్-బ్రంట్, అమేలియా కెర్, హర్మన్‌ప్రీత్ కౌర్, హేలీ మాథ్యూస్, అమన్‌జోత్ కౌర్, సజీవన్ సజ్న, షబ్నిమ్ ఇస్మాయిల్, గుణాలన్ కులకర్ణి, నికోలా కారీ, సంస్కృతి గుప్తా, రాహిల్ ఫిర్దౌస్, పూనమ్ ఖేమ్నార్, త్రివేణి వశిష్ఠ, నల్లా రెడ్డి, సైకా ఇషాక్, మిల్లీ ఇల్లింగ్‌వర్త్.

Advertisement

Details

దిల్లీ క్యాపిటల్స్ (DC) 

షెఫాలీ వర్మ, అన్నబెల్ సదర్లాండ్, జెమిమా రోడ్రిగ్స్, మారిజానే కాప్, శ్రీ చరణి, షినెల్ హెన్రీ, లారా వూల్వార్ట్, నిక్కీ ప్రసాద్, స్నేహ్ రాణా, తానియా భాటియా, లిజెల్ లీ, దియా యాదవ్, మమత మదివాల, నందిని శర్మ, లూసీ హామిల్టన్, మిన్ను మణి. గుజరాత్ జెయింట్స్ (GG) ఆష్లే గార్డ్‌నర్, బెత్ మూనీ, సోఫీ డివైన్, జార్జియా వేర్‌హామ్, భారతి ఫుల్మాలి, కాశ్వి గౌతమ్, రేణుకా సింగ్, యస్తికా భాటియా, అనుష్క శర్మ, తనుజా కన్వర్, కనికా అహుజా, టిటాస్ సాధు, హ్యాపీ కుమారి, కిమ్ గార్త్, శివాని సింగ్, డేనియల్ వ్యాట్-హాడ్జ్, రాజేశ్వరి గైక్వాడ్, ఆయుషి సోని.

Advertisement

Details

యూపీ వారియర్స్ (UPW)

దీప్తి శర్మ, శిఖా పాండే, మెగ్ లానింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఆశా శోభన, సోఫీ ఎక్లెస్టన్, డీండ్రా డాటిన్, కిరణ్ నవగిరే, క్రాంతి గౌడ్, శ్వేత సెహ్రావత్, హర్లీన్ డియోల్, క్లో ట్రయోన్, సుమన్ మీనా, సిమ్రన్ షేక్, జి త్రిష, ప్రతీక్ రావల్.

Advertisement