WPL 2026 Auction: డబ్ల్యూపీఎల్ వేలం కౌంట్‌డౌన్.. నవంబర్ 27న రికార్డులు తిరగరాయనున్న స్టార్ మహిళా క్రికెటర్లు వీరే!
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) నాల్గో సీజన్ కోసం క్రికెటర్ల రిటెన్షన్ ప్రక్రియ పూర్తయ్యింది. టోర్నీ షెడ్యూల్ కూడా ప్రకటించగా, ఇప్పుడు మిగిలింది కేవలం మెగా వేలం మాత్రమే. నవంబర్ 27న ఢిల్లీలో జరగనున్న ఈ వేలం కోసం ఐదు ఫ్రాంచైజీలు ప్రపంచకప్‌లో మెరిసిన స్టార్ క్రికెటర్లను అట్టిపెట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈసారి మొత్తం 277 మంది క్రికెటర్లు వేలానికి వస్తున్నారు. ముఖ్యంగా వరల్డ్ కప్‌లో భారత్‌కు మెరుగైన విజయాలు అందించిన దీప్తి శర్మ, దక్షిణాఫ్రికాను ఫైనల్‌కు చేర్చిన లారా వొల్వార్డ్త్, రెండు శతకాలతో అద్భుత ప్రదర్శన చేసిన అలీసా హీలీ, మహిళల బిగ్‌బాష్ లీగ్ (BBL 2025)లో సెంచరీతో మెరిసిన మేగ్ లానింగ్ వంటి స్టార్లు వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.
Details
వేలంలో అత్యధిక ధర ఆశిస్తున్న స్టార్‌లు
WPL నాల్గో సీజన్‌లో అత్యధిక ధర పలికే ప్లేయర్ల జాబితాలో దీప్తి శర్మ ముందున్నది. వరల్డ్ కప్‌లో ఆల్‌రౌండర్‌గా కీలక పాత్ర పోషించిన ఆమె ఈ వేలంలో కనీస ధర రూ.50 లక్షలు. ఆమెతో పాటు అలీసా హీలీ, సోఫీ డెవినే, అమేలియా కేర్, మేగ్ లానింగ్‌లకు కూడా ఫ్రాంచైజీల నుంచి భారీ ఆసక్తి ఉంది. భారత పేసర్ రేణుకా సింగ్ రూ.40 లక్షలు, లారా వొల్వార్డ్త్ రూ.30 లక్షల కనీస ధరతో బరిలో నిలుస్తున్నారు.
Details
194 మంది భారత క్రికెటర్లు బరిలో
ఈసారి వేలంలో 194 మంది భారత క్రికెటర్లు పాల్గొంటున్నారు. ఇతర దేశాల వారీగా ఆస్ట్రేలియా - 23 మంది ఇంగ్లాండ్ - 22 మంది న్యూజిలాండ్ - 13 మంది దక్షిణాఫ్రికా - 11 మంది వెస్టిండీస్ - 4 బంగ్లాదేశ్, శ్రీలంక - తలో 3 యూఏఈ - 2 థాయ్‌లాండ్, యూఎస్ - తలో 1
Details
ఫ్రాంచైజీల పర్స్ వివరాలు - మొత్తం రూ. 15 కోట్లు
ఒక్కో ఫ్రాంచైజీకి మొత్తం రూ.15 కోట్ల బడ్జెట్ ఉంది. స్లాబ్‌లు ఇలా ఉన్నాయి: మొదటి ప్లేయర్ - ₹3.5 కోట్లు రెండో ప్లేయర్ - ₹2.5 కోట్లు మూడో ప్లేయర్ - ₹1.75 కోట్లు నాలుగో ప్లేయర్ - ₹1 కోటి ఐదుగురికి - తలో ₹50 లక్షలు ఒక ఫ్రాంచైజీ ఐదుగురిని రీటైన్ చేస్తే మొత్తం రూ.9.75 కోట్లు కట్ అవుతాయి. నలుగురైతే రూ.8.75 కోట్లు, ముగ్గురైతే రూ. 7.75 కోట్లు, ఇద్దరైతే రూ.6 కోట్లు తగ్గిస్తారు.
Details
ఫ్రాంచైజీ వారీగా రిటెన్షన్ జాబితా & మిగిలిన పర్స్
ముంబై ఇండియన్స్ నాట్ సీవర్ బ్రంట్ - ₹3.5 కోట్లు హర్మన్‌ప్రీత్ కౌర్ - ₹2.5 కోట్లు హేలీ మాథ్యూస్ - ₹1.7 కోట్లు అమన్‌జోత్ కౌర్ - ₹1 కోటి జి. కమలిని - ₹50 లక్షలు మిగిలిన పర్స్: ₹5.75 కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్ జెమీమా రోడ్రిగ్స్ - ₹2.2 కోట్లు షఫాలీ వర్మ - ₹2.2 కోట్లు మరినే కాప్ - ₹2.2 కోట్లు అనాబెల్ సథర్‌లాండ్ - ₹2.2 కోట్లు నిక్కీ ప్రసాద్ (అన్‌క్యాప్డ్) - ₹50 లక్షలు మిగిలిన పర్స్: ₹6.75 కోట్లు
Details
యూపీ వారియర్స్
శ్వేతా షెరావత్ - ₹50 లక్షలు మిగిలిన పర్స్: ₹14.5 కోట్లు ఆర్సీబీ స్మృతి మంధాన - ₹3.5 కోట్లు రీచా ఘోష్ - ₹2.75 కోట్లు ఎలీసా పెర్రీ - ₹2 కోట్లు శ్రేయాంక పాటిల్ - ₹60 లక్షలు మిగిలిన పర్స్: ₹6.15 కోట్లు గుజరాత్ జెయింట్స్ బేత్ మూనీ - ₹3.5 కోట్లు అష్ గార్డ్‌నర్ - ₹2.5 కోట్లు మిగిలిన పర్స్: ₹9 కోట్లు