ఐపీఎల్ ఉమెన్స్ ప్లేయర్ల వేలం తేదీలు ఖరారు..?
ఇటీవలే ఫ్రాంచేజీల వేలం ముగిసింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ప్రస్తుతం మరో ప్రక్రియకు బీసీసీఐ శ్రీకారం చుట్టింది. ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 11న న్యూఢిల్లి లేదా ఫిబ్రవరి 13న ముంబైలో జరిగే అవకాశం ఉందని ESPN cricinfo నివేదించింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ వారంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చేందుకు బీసీసీఐ ముంబైలో రెండు వేదికలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. WPL 2023లో లక్నో, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్ జట్లు పాల్గొంటాయి. ఈ సీజన్‌లో 22 మ్యాచ్ లు జరగనున్నాయి. ఒక్కో జట్టుకు 15 నుంచి 18 మంది ఆటగాళ్లు ఉండనున్నారు
అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కోసం రూ. 1,289 కోట్లు
ఫిబ్రవరి మొదటి వారంలో వేలం నిర్వహించాలని తొలుత భావించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. రెండు కారణాల వల్ల ఇది చాలా వరకు వాయిదా పడింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ 2023 ముగిసిన ఒక వారం తర్వాత ఉమెన్స్ ఐపీఎల్ లీగ్ ప్రారంభం కానుంది. అదానీ గ్రూప్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కోసం రూ. 1,289 కోట్లు, ముంబైకి చెందిన జట్టును ముంబై ఇండియన్స్ యాజమాన్యం రూ. 912.99 కోట్లు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం బెంగళూరుకు జట్టును రూ. 901 కోట్లు. ఢిల్లీకి చెందిన జట్టును ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం రూ. 810 కోట్లను ఇప్పటికే చెల్లించింది.