WTA Finals: డబ్ల్యూటీఏ ఫైనల్స్.. టైటిల్ పోరుకు స్వితోలినా, మిరా ఆండ్రీవా
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 16, 2026
09:10 am
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల టెన్నిస్ సంఘం (WTA) సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో ఉక్రెయిన్ స్టార్ స్వితోలినా, రష్యా యువ సంచలనం మిరా ఆండ్రీవా ఫైనల్‌కు దూసుకెళ్లారు. సెమీఫైనల్స్‌లో వీరిద్దరూ ప్రత్యర్థులపై వరుస సెట్లలో విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించారు. నొస్కోవాపై స్వితోలినా ఘన విజయం ప్రపంచ ఆరో ర్యాంకర్ స్వితోలినా (ఉక్రెయిన్) సెమీఫైనల్లో 6-2, 6-1తో ఎనిమిదో ర్యాంకర్ లిండా నొస్కోవా (చెక్ రిపబ్లిక్)ను చిత్తు చేసింది. 2018లో డబ్ల్యూటీఏ ఫైనల్స్ ఛాంపియన్‌గా నిలిచిన స్వితోలినా.. 2019లో రన్నరప్‌గా నిలిచింది. మరోసారి టైటిల్ పోరుకు చేరుకుంది.
వివరాలు
పెగూలాపై ఆండ్రీవా విజయం
మరో సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ మిరా ఆండ్రీవా (రష్యా) 6-3, 6-4తో ఐదో ర్యాంకర్ జెస్సికా పెగూలా (అమెరికా)పై విజయం సాధించింది.
దీంతో స్వితోలినాతో కలిసి ఫైనల్లో టైటిల్ కోసం తలపడనుంది.