WTC: డబ్ల్యూటీసీ టేబుల్ నాలుగో స్థానంలో ఇంగ్లండ్.. చివరి స్థానానికి పడిపోయిన పాకిస్థాన్
పాకిస్థాన్‌ను తొలి టెస్టులో ఓడించిన ఇంగ్లండ్‌కు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో పెద్ద మార్పు రాలేదు. గతంలో ఉన్న నాలుగో స్థానంలోనే ఇంగ్లండ్ కొనసాగుతోంది, అయితే, ఈ మ్యాచ్‌తో తమ పర్సంటేజీని 42.19 నుంచి 45.59 వరకు పెంచుకుంది. మరోవైపు, స్వదేశంలో మరో ఓటమిని చవిచూసిన పాకిస్థాన్ పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి దిగజారింది. ఈ మ్యాచ్‌కు ముందు 19.05 శాతం తో ఎనిమిదో స్థానంలో ఉన్న పాక్, సవరించిన గణాంకాల ప్రకారం 16.67 శాతం తో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. టాప్-3లో భారత్ (74.24), ఆస్ట్రేలియా (62.50), శ్రీలంక (55.56) ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ నాటికి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తలపడతాయి.
కేవలం రెండే టెస్టుల్లో విజయం
డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో,పాకిస్థాన్ 8 మ్యాచ్‌లు ఆడింది.వాటిలో కేవలం రెండు మ్యాచులలో మాత్రమే విజయం సాధించింది.మిగతా మ్యాచ్‌లు ఓడిపోయాయి. మరోవైపు, ఇంగ్లండ్ అన్ని జట్ల కంటే ఎక్కువగా 17 టెస్టులు ఆడింది.అందులో 9 మ్యాచుల్లో గెలిచింది. 7 మ్యాచుల్లో ఓడింది,1 మ్యాచును డ్రా చేసింది. బజ్‌బాల్ క్రికెట్‌తో ఫలితం తేలడమే లక్ష్యంగా ఇంగ్లండ్ గత కొన్నేళ్లుగా దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో,వరుసగా మ్యాచుల్లో గెలుస్తూ వస్తోన్న ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరాలంటే మిగతా నాలుగు మ్యాచుల్లోనూ గెలవాల్సి ఉంది. అప్పుడు ఇతర జట్ల సమీకరణాలనుబట్టి టాప్-2లోకి రాబోయే అవకాశం ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్‌తో మరొక టెస్టు ఆడాల్సి ఉంది,తర్వాత న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది
బౌలింగ్‌లో విఫలమయ్యాం: షాన్ మసూద్
భారత్‌కు 8 మ్యాచుల్లో 3,ఆసీస్‌కు 7 మ్యాచుల్లో 4 విజయాలు దక్కితే చాలు, మరోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటాయి. "మొదటి ఇన్నింగ్స్‌లో 550కిపైగా పరుగులు బోర్డుపై ఉంచినప్పుడు, బౌలర్లు 10 వికెట్లు తీసి అండగా ఉండాల్సింది. కానీ, ప్రత్యర్థికి 220కిపైగా ఆధిక్యం ఇచ్చాం. ఇంగ్లండ్ బౌలర్లు మాత్రం మా 20 వికెట్లను పడగొట్టగలిగారు. సొంత పిచ్‌లపై ఉన్న అడ్వాంటేజ్‌ను మా బౌలర్లు సరిగ్గా వాడుకోలేకపోయారు. మున్ముందు జరిగే మ్యాచుల్లో వీటిపై మరింత దృష్టి పెడతాం" అని పాక్ కెప్టెన్ షాన్ మసూద్ వ్యాఖ్యానించాడు.