WTC FINAL 2023: హేజిల్‌వుడ్ దూరంతో టీమిండియాకు బలం పెరిగిందా..?
డబ్ల్యూటీసీ ఫైనల్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కీలక ఆటగాడు హేజిల్‌వుడ్ మ్యాచ్ కు దూరమయ్యాడు. టీమిండియా నుంచి ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ నుంచి తప్పుకున్నాడు. బుమ్రా స్థానంలో మహ్మద్ షమీ ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించనున్నాడు. అయితే జోష్ హేజిల్ వుడ్ అందుబాటులో లేకపోవడం టీమిండియా కు ప్లస్.. ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద మైనస్ గా చెప్పొచ్చు. టెస్టు క్రికెట్లో జోష్ హేజిల్‌వుడ్ కి అపారమైన అనుభవం ఉంది. 2014లో ఆస్ట్రేలియా తరుపున అరంగేట్రం చేసిన జోష్ 59 టెస్టుల్లో 222 వికెట్లు పడగొట్టాడు.
హేజిల్ వుడ్ దూరం కావడం టీమిండియాకు లాభమే!
ముఖ్యంగా టెస్టు ఫార్మాట్లో జోష్ హేజిల్‌వుడ్ లైన్ అండ్ లెంగ్త్ అద్భుతంగా ఉన్నాయి. టెస్టుల్లో టీమిండియాపై అతనికి మంచి రికార్డు ఉంది. భారత్‌తో 15 టెస్టు మ్యాచులు ఆడి 51 వికెట్లు పడగొట్టాడు. పుజారాను ఆరుసార్లు, రహానేను ఐదుసార్లు, విరాట్ కోహ్లీని మూడుసార్లు ఔట్ చేశాడు. ఇంగ్లండ్ లో జోష్ అద్భుతంగా రాణించిన అనుభవం ఉంది. ఇంగ్లండ్ లో 8 టెస్టు మ్యాచుల్లో 23.58 సగటుతో 36 వికెట్లు తీశాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో ఆస్ట్రేలియాకు హేజిల్‌వుడ్ దూరం కావడం పెద్ద మైనస్ కాగా.. టీమిండియా లాభమని చెప్పొచ్చు.