WTC Final : రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియా.. టీమిండియా గెలిస్తే చరిత్రే
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా, టీమిండియా ముందు భారీ టార్గెట్ ను ఉంచింది. 84.3 ఓవర్లలలో 8 వికెట్ల నష్టానికి 270 పరుగుల వద్ద ఆస్ట్రేలియా డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియా ముందు 444 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది. ఆసీస్ బ్యాటర్లలో అలెక్స్ క్యారీ 66*, స్కార్ట్ 41 రన్స్ తో రాణించారు. వీరిద్దరూ ఏడో వికెట్ కు 93 పరుగులు జోడించడం విశేషం. దీంతో ఆస్ట్రేలియా ఆధిక్యం 400 పరుగుల మార్క్ ను దాటింది. ముందుగా లబుషేన్ 41 రన్స్ తో రాణించారు. భారత్ బౌలర్లలో రవీంద్రజడేజా 3 వికెట్లు, ఉమేష్ యాదవ్, సిరాజ్ లకు రెండేసి వికెట్లు లభించాయి. షమీ ఒక వికెట్ సాధించాడు.
టీమిండియా విజయ లక్ష్యం 444 పరుగులు
రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ బ్యాటర్లు తడపడ్డారు.డేవిడ్ వార్నర్(1), ఉస్మాన్ ఖవాజా 13 పరుగులు చేసి పెవిలియానికి చేరారు. తొలి ఇన్నింగ్స్ లో సత్తా చాటిన స్టీవ్ స్మిత్ 34, ట్రావిస్ హెడ్ 18 పరుగులు చేసి నిరాశపరిచారు. వీరిద్దరూ రవీంద్ర జడేజా బౌలింగ్ ఔట్ కావడం విశేషం. ఒకవేళ ఆస్ట్రేలియా పై టీమిండియా గెలిస్తే చారిత్రాత్మక విజయాన్ని అందుకొనే అవకాశం ఉంటుంది. 2003లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ 418 పరుగుల లక్ష్యాన్ని చేధించి గెలవడమే ఇప్పటిదాకా టెస్టుల్లో అత్యధిక విజయవంత చేధన కావడం విశేషం. ప్రస్తుతం ఆస్ట్రేలియా టీమిండియాకు 444 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఇది గెలిస్తే టెస్టుల్లో అత్యధిక లక్ష్యాన్ని చేధించిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించనుంది.