WTC Final: 200 ధాటిన భారత్ స్కోరు.. గాయమైనా పోరాడుతున్న రహానే!
టీమిండియా సీనియర్ బ్యాటర్ అంజిక్య రహానే ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నాడు. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని భారత్ తొలి ఇన్నింగ్స్ లో రహానే హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. 92 బంతుల్లోనే 52 పరుగులు చేసి సత్తా చాటాడు. కమ్మిన్స్ బౌలింగ్ లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టి రహానే తన ఖాతాలో హాఫ్ సెంచరీ వేసుకున్నాడు. రెండో రోజు ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తుండగా రహానే చేతికి గాయమైంది. అయితే చేతికి టేప్ చుట్టుకొని ఆసీస్ పేస్ అటాక్ ను తన డిఫెన్స్ బ్యాటింగ్ శైలిలో అడ్డుకుంటున్నాడు. అతని తోడు శార్దుల్ ఠాకూర్ కూడా (30) నిలకడగా అడుతున్నాడు. ఇంకా టీమిండియా 234 పరుగులు వెనుకబడి ఉంది.