విరాట్ కోహ్లీ Vs రోహిత్ శర్మ.. ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇద్దరూ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు. ఓపెనర్ గా వచ్చిన రోహిత్ శర్మ 26 బంతుల్లో 15 పరుగులు చేసి కమ్మిన్స్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ 31 బంతుల్లో 14 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో ఇద్దరు అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం చెలరేగింది. ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుంటూ దుమ్మెత్తిపోసుకుంటున్నారు. మొదట ఈమ్యాచులో రోహిత్ శర్మ ఔటైన వెంటనే అతడిపై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ మొదలైంది. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాలని కామెంట్లతో రెచ్చిపోయారు.
ఫ్యాన్స్ తిట్టుకోవడం కరెక్టు కాదు
ముఖ్యంగా కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలవకపోవడానికి కారణం రోహిత్ శర్మ అని ఆరోపించారు. మరోవైపు విరాట్ కోహ్లీ ఔటైన వెంటనే రోహిత్ శర్మ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. రోహిత్ శర్మ కంటే కోహ్లీనే ఫ్రాడ్ అని ఆరోపణలు చేశారు. లైఫ్ లభిస్తేనే కోహ్లీ ఆడుతాడని విమర్శలు చేశారు. అప్ఘనిస్తాన్ వంటి చిన్న దేశాలపై మాత్రమే సెంచరీలు చేస్తాడని మండిపడ్డారు. ముఖ్యంగా ఐపీఎల్ లో తప్ప కోహ్లీ ఎక్కడా ఆడాడని అన్నారు. రోహిత్ శర్మను విమర్శించే ముందు కోహ్లీ గణాకాంలు పరిశీలించాలని రోహిత్ ఫ్యాన్స్ సూచించారు. ఈ వ్యవహారాన్ని తటస్థ అభిమానులు తప్పుబడుతున్నారు. మన ఆటగాళ్లను మనడే తిట్టుకోవడం మంచి సంప్రదాయం కాదని చెబుతున్నారు.