టెస్టుల్లో అంజిక్య రహానే గొప్ప రికార్డు.. ఏడో బ్యాటర్‌గా ఘనత
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో తడబడుతున్న టీమిండియాకు ఓ రికార్డు దక్కింది. ఈ మ్యాచులో సీనియర్ క్రికెటర్ అంజిక్య రహానే ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ క్యాచ్ పట్టిన అతను.. టెస్టుల్లో 100 క్యాచులు అందుకున్న ఏడో భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ 209 క్యాచులతో అగ్రస్థానంలో ఉన్నాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనే 205 క్యాచులతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక మ్యాచు విషయానికొస్తే.. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో నిరాశపరిచింది.
పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
భారత జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (15), శుభ్‍మన్ గిల్ (13), చతేశ్వర్ పుజారా (14), విరాట్ కోహ్లి (14) పేలవ ప్రదర్శనతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. రవీంద్ర జడేజా 48 పరుగులతో రాణించడంతో టీమిండియా 150 పరుగులను మార్క్ ను దాటింది. ప్రస్తుతం రహానే 29, శ్రీకర్ భరత్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.