Loading...
Ajinkya Rahane : అప్పుడు నాలుగు మ్యాచుల నిషేధం తప్పించి.. యశస్విని కాపాడిన రహానే!
అప్పుడు నాలుగు మ్యాచుల నిషేధం తప్పించి.. యశస్విని కాపాడిన రహానే!

Ajinkya Rahane : అప్పుడు నాలుగు మ్యాచుల నిషేధం తప్పించి.. యశస్విని కాపాడిన రహానే!

వ్రాసిన వారు Moogati Shabari
Aug 09, 2026
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవాళీ క్రికెట్‌లో అజింక్య రహానే ముంబయి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. దులీప్ ట్రోఫీలోనూ వెస్ట్ జోన్ జట్టుకు సారథిగా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే నాలుగేళ్ల క్రితం భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌పై నాలుగు మ్యాచుల నిషేధం పడకుండా రహానే తీసుకున్న ఓ నిర్ణయం అతడిని కాపాడింది. ఆ సమయంలో రహానే సమయస్ఫూర్తితో వ్యవహరించి జైస్వాల్‌ను తీవ్ర చర్య నుంచి తప్పించాడు. అప్పటి ఘటనను రహానే తాజాగా గుర్తు చేసుకున్నాడు.

వివరాలు

అసలేం జరిగిందంటే?

దులీప్ ట్రోఫీ 2022 ఫైనల్లో సౌత్ జోన్, వెస్ట్ జోన్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో వెస్ట్ జోన్‌కు అజింక్య రహానే కెప్టెన్‌గా ఉన్నాడు.

అప్పటికి యశస్వి జైస్వాల్ యువ ఆటగాడిగా తన సత్తా చాటుతున్నాడు.

అయితే మ్యాచ్‌లో క్రమశిక్షణ తప్పడంతో అతడిపై నాలుగు మ్యాచుల నిషేధం విధించేందుకు అంపైర్లు సిద్ధమయ్యారు.

కానీ రహానే తీసుకున్న నిర్ణయంతో జైస్వాల్ ఆ నిషేధం నుంచి బయటపడ్డాడు.

వివరాలు

పదేపదే స్లెడ్జింగ్ చేస్తూ..

సౌత్ జోన్ బ్యాటర్ రవితేజను జైస్వాల్ పదేపదే స్లెడ్జింగ్ చేస్తూ రెచ్చగొట్టాడు.

ఈ వ్యవహారం కాస్త ముదరడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో అంపైర్లు రహానే వద్దకు వెళ్లి పరిస్థితిని వివరించారు.

వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు జైస్వాల్‌ను మైదానం వీడాలని రహానే సూచించాడు.

అయినప్పటికీ జైస్వాల్ స్లెడ్జింగ్ కొనసాగించడం గమనార్హం. చివరకు కెప్టెన్ ఆదేశించడంతో అయిష్టంగానే జైస్వాల్ డగౌట్‌కు వెళ్లాడు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పోస్ట్ ఇదే..

ADVERTISEMENT