Loading...
IND vs NZ: ఒక్క రూపాయి ఖర్చు లేకుండా టీమిండియా, న్యూజిలాండ్ మ్యాచ్ చూడొచ్చు.. ఎక్కడంటే?
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా టీమిండియా, న్యూజిలాండ్ మ్యాచ్ చూడొచ్చు.. ఎక్కడంటే?

IND vs NZ: ఒక్క రూపాయి ఖర్చు లేకుండా టీమిండియా, న్యూజిలాండ్ మ్యాచ్ చూడొచ్చు.. ఎక్కడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2026
01:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌పై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు కీలకమైన మూడో వన్డేకు ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. అయితే మ్యాచ్‌ను టీవీ, మొబైల్‌లో చూసేందుకు ప్రత్యేక రీఛార్జ్ లేదా సబ్‌స్క్రిప్షన్ అవసరమా? అని చాలామంది అభిమానులు ఆలోచిస్తున్నారు. అలాంటి వారికి ఓ శుభవార్త. భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌ను ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా చూసే అవకాశం ఉంది. మరి ఎక్కడ, ఎలా చూడాలంటే?

వివరాలు

మూడో వన్డే ఎప్పుడు? ఎక్కడ?

భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో వన్డే నవంబర్ 10, మంగళవారం హామిల్టన్‌లోని సెడ్డన్ పార్క్ మైదానంలో జరగనుంది.

భారత కాలమానం ప్రకారం ఉదయం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

అంతకంటే అరగంట ముందు అంటే ఉదయం 7 గంటలకు టాస్ పడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది.

వివరాలు

టీవీ, మొబైల్‌లో లైవ్ ఎక్కడ చూడొచ్చు?

భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్ ప్రత్యక్ష ప్రసార హక్కులు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ వద్ద ఉన్నాయి.

టీవీలో సోనీ స్పోర్ట్స్ 1, సోనీ స్పోర్ట్స్ 5, సోనీ స్పోర్ట్స్ 3 హిందీ, సోనీ స్పోర్ట్స్ 4 ప్రాంతీయ భాషా ఛానళ్లలో మ్యాచ్‌ను వీక్షించవచ్చు. మొబైల్, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్‌లలో SonyLIV యాప్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.

అయితే SonyLIVలో మ్యాచ్‌ను వీక్షించాలంటే తగిన సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.

భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌లను ఉచితంగా చూడాలనుకునే వారికి డీడీ స్పోర్ట్స్ మంచి అవకాశం.

ఇంట్లో DD Free Dishకనెక్షన్ ఉంటే DD Sportsఛానల్‌లో మూడో వన్డేను ఉచితంగా వీక్షించవచ్చు. ఇందుకోసం నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఈ సిరీస్‌లో మిగిలిన

ADVERTISEMENT

వివరాలు

 DD Sports ద్వారా ఉచితంగా చూడవచ్చు

అయితే కేబుల్ టీవీ లేదా ఇతర DTH సర్వీసులు ఉపయోగిస్తున్న వారికి ఇదే తరహాలో ఉచిత ప్రసారం అందుబాటులో ఉంటుందని చెప్పలేం. ఉచితంగా మ్యాచ్ చూడాలంటే DD Free Dish కనెక్షన్ ఉండాలి.

తొలుత భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగ్గా.. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కొనసాగుతోంది.

దీని తర్వాత రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో మూడో వన్డే ఇరు జట్లకు కీలకంగా మారింది.

మరోవైపు హామిల్టన్‌లో వర్షం పడే అవకాశం ఉండటంతో మ్యాచ్‌పై ఆసక్తి మరింత పెరిగింది. ఈ కీలక పోరులో ఇరు జట్ల తరఫున బరిలోకి దిగే ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT