Page Loader
MS Dhoni: ధోనితో మాట్లాడినా ప్రతిసారి కొత్త విషయాన్ని నేర్చుకుంటా : సంజీవ్ గోయెంకా
ధోనితో మాట్లాడినా ప్రతిసారి కొత్త విషయాన్ని నేర్చుకుంటా : సంజీవ్ గోయెంకా

MS Dhoni: ధోనితో మాట్లాడినా ప్రతిసారి కొత్త విషయాన్ని నేర్చుకుంటా : సంజీవ్ గోయెంకా

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 12, 2024
01:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పినా అతని క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులే కాకుండా, మిగతా జట్ల అభిమానులు కూడా ధోనీకి అభిమానాన్ని చాటుతుంటారు. ఐపీఎల్ యజమానులు కూడా ఎంఎస్ ధోని వ్యక్తిత్వానికి, నాయకత్వానికి గౌరవం ఇస్తారు. ఇటీవల లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని ధోనీ గురించి మాట్లాడారు. ఎంఎస్ ధోనీ లాంటి నాయకుడిని తాను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని, అతని ఆలోచనా విధానం, ప్రవర్తించే తీరు తనని ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు.

Details

యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం అభినందనీయం

మతిశా పతిరన లాంటి యువ బౌలర్‌ను డేంజరస్‌ మ్యాచ్ విన్నర్‌గా తయారు చేశారని కొనియాడారు. ధోనీతో మాట్లాడినా ప్రతి సారి ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటానని తెలిపారు. తన మనవడికి క్రికెట్‌ అంటే పిచ్చి అని, ఒకసారి ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ధోనీని కలిసినప్పుడు తన మనవడు ధోనీని అనేక ప్రశ్నలు అడిగినా ఓర్పుగా సమాధానం చెప్పారన్నారు. ఇక ధోనీకి ఐపీఎల్‌లో ప్రత్యేక స్థానం ఉంది. 2025 ఐపీఎల్ సీజన్‌కు ముందు, సీఎస్కే ధోనీని రూ.4 కోట్లకు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా రిటైన్ చేసుకుంది.