Mushir Khan: రోడ్డు ప్రమాదానికి గురైన యువ క్రికెటర్ ముషీర్ ఖాన్
ఇరానీ కప్ 2024లో ముంబై జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు యంగ్ బ్యాటర్ ముషీర్ ఖాన్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. తండ్రితో పాటు లోక్నోకు వెళ్తుతుండగా ఈ ఘటన జరిగినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ముషీర్‌కి ఫ్యాక్చర్ అయినట్లు తెలిసింది. ఇటీవలే తన అద్భుత ప్రదర్శనతో ముంబై జట్టు విజయాన్ని సొంతం చేసుకుంది. దులీప్ ట్రోఫీలో కూడా తన ప్రతిభను చాటి, భారత్ A జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 181 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అక్టోబర్ 1న ప్రారంభం కానున్న ఇరానీ కప్‌లో ముషీర్ ముంబై జట్టు తరఫున ఆడాల్సి ఉంది. తాజాగా గాయాలు కావడంతో అతను వచ్చే ఇరానీ ట్రోఫీకి దూరమయ్యే అవకాశం కన్పిస్తోంది.