
ICC champions Trophy: అప్పుడూ యువ క్రీడాకారులు.. ఇప్పుడూ విజయాన్ని మోసిన సీనియర్లు!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ చివరిసారిగా 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది.
దీని తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం మరోసారి కప్ అందుకుంది.
అయితే ఆ టైమ్‌లో గెలిచిన జట్టులోనూ, ఇప్పుడు విజయం సాధించిన జట్టులోనూ ముగ్గురు సభ్యులు మాత్రం మారలేదు. వారే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా.
2013లో యువ క్రికెటర్లుగా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ ముగ్గురు... ఇప్పుడు సీనియర్లుగా జట్టు విజయాన్ని ముందుండి నడిపించారు.
తాజా ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించడమే కాకుండా, ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును ముందుండి నడిపించాడు.
Details
ఐదు వికెట్లతో సత్తా చాటిన జడేజా
కోహ్లి పాకిస్థాన్‌పై, ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శన చేశాడు.
జడేజా తన స్పిన్‌తో సమర్థంగా రాణించాడు. ఈ టోర్నమెంట్‌లో విరాట్ కోహ్లీ 5 మ్యాచ్‌ల్లో 218 పరుగులు చేయగా, రోహిత్ 180 పరుగులతో ఆకట్టుకున్నాడు.
ఇక జడేజా మొత్తం 5 వికెట్లు తీసి తానెంటో మరోసారి నిరూపించుకున్నాడు.