Yuvraj singh: కపిల్, ధోనికి క్షమాపణలు.. యువరాజ్ సింగ్ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల యోగ్‌రాజ్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్‌గా ఉన్న సమయంలో తన కుమారుడు యువరాజ్ సింగ్‌కు అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. భారత జట్టుకు వరల్డ్ కప్‌లు అందించిన కెప్టెన్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన మాజీ భారత ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఈ విషయంపై స్పందించాడు. కపిల్ దేవ్, ఎంఎస్ ధోనికి క్షమాపణలు చెప్పాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేశాడు.
వివరాలు
వారికి నా క్షమాపణలు..
యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. తన తండ్రి ఇచ్చిన ఇంటర్వ్యూలను తాను చూశానని, అవి సరైనవి కావని, ఇప్పటికే పలుమార్లు తన తండ్రికి చెప్పినట్లు పేర్కొన్నాడు. అందువల్ల ఆయన తరఫున తానే కపిల్ దేవ్, ధోనికి క్షమాపణలు తెలియజేస్తున్నానని యువరాజ్ వివరించాడు. ఇదే ఇంటర్వ్యూలో తన శిష్యుడు అభిషేక్ శర్మ ప్రదర్శనపై కూడా యువరాజ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అలాగే విరాట్ కోహ్లీ, సంజు శాంసన్, రిషభ్ పంత్‌తో పాటు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ గురించి కూడా పలు విషయాలను వెల్లడించాడు. ఇంతకుముందు ఒక కార్యక్రమంలో క్రికెటర్లు గోల్ఫ్ ఆటను కూడా ఆడాలని యువరాజ్ సూచించాడు. విదేశీ క్రికెటర్లలో చాలామంది చిన్న వయస్సు నుంచే గోల్ఫ్ ఆడుతూ వస్తున్నారని కూడా గుర్తుచేశాడు.