Yuzvendra Chahal: కౌంటీ క్రికెట్లో అరంగ్రేటం చేయనున్న యుజేంద్ర చాహల్
ఈ వార్తాకథనం ఏంటి
భారత స్టార్ పేసర్ యుజేంద్ర చాహల్ కౌంటీ క్రికెట్లో అరంగ్రేటం చేయనున్నాడు.
భారత వరల్డ్ కప్, ఆసియా కప్ లో చాహల్ ను ఎంపిక చేయలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురైన చాహల్ కౌంటీల్లో ఆడి సత్తా చాటాలని భావిస్తున్నారు.
త్వరలోనే ఈ లెగ్ స్పిన్నర్ కెంట్ జట్టు రుపున నాటింగ్ హామ్ షైర్ పై తొలి మ్యాచ్ ఆడటానికి సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని కెంట్ క్రికెట్ అధికారికంగా ధ్రువీకరించింది.
ఈ టోర్నీలో చాహల్ మొత్తం మూడు మ్యాచులు ఆడనుండగా, ఒక్కో మ్యాచ్ నాలుగు రోజుల పాటు జరగనుంది.
కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఇప్పటికే బీసీసీఐ నుంచి చాహల్ నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ సైతం అందుకున్నట్లు తెలిసింది.
Details
చాహల్ భార్య ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ సందర్భంగా చాహల్ భార్య ధనశ్రీ వర్మ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.
తాను చాహల్ చూసి ఎప్పుడూ గర్వపడతానని, తాను మా అందరికి ఓ లెజెండ్ అని ధనశ్రీ పేర్కొంది.
వెస్టిండీస్ పర్యటనలో రాణించిన చాహల్ వన్డే వరల్డ్ కప్ 2023 కి ఎంపిక కాకపోవడానికి లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ మీద దృష్టి పెట్టడమే అని తెలుస్తోంది.
చాహల్ కి బదులుగా కుల్దీద్ యాద్ ఈ మెగా టోర్నీలో చోటు సంపాదించాడు. ఇప్పటివరకూ 72 వన్డేలు ఆడి 121 వికెట్లను చాహల్ పడగొట్టాడు.