'టీ20 వరల్డ్ కప్ చాహెల్ అడుంటే ఎక్కవ నష్టం జరిగేది' : దినేష్ కార్తీక్
టీమిండియా సీనియర్ ఆటగాడు దినేష్ కార్తీక్.. స్పిన్నర్ చాహల్ పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచ కప్ లో లెగ్ స్పిన్నర్ చాహల్ ను ఆడించి ఉంటే టీమిండియా ఎక్కువ నష్టం జరిగేదని కార్తీక్ అభిప్రాయపడ్డాడు. ఇండియాకు 2022 పెద్దగా కలిసి రాలేదు. ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ను ఓడిపోయింది. చివర్లో బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ ను కోల్పోయింది. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లో అశించిన స్థాయిలో రాణించలేదు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, జట్టుపై విమర్శలు వెల్లువెత్తాయి. నవంబర్ లో అస్ట్రేలియాలో జరిగిన పొట్టి కప్పులో చాహెల్ కు ఒక్క మ్యాచ్ లో కూడా అవకాశం దక్కలేదు.
చాహెల్ పై దినేష్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు
దీనిపై టీమిండియా సీనియర్ ఆటగాడు దినేష్ కార్తీక్ స్పందించాడు. 'ఈ నిర్ణయాలు పూర్తిగా కోచ్, కెప్టెనే తీసుకున్నారు. ఓ ఆటగాడిపై ఉన్న అమితమైన నమ్మకం కారణంగా ఇలా జరిగింది. రవిచంద్రన్ అశ్విన్ టోర్నమెంట్ ను బాగా ప్రారంభించాడు. బహుశా సరిగ్గా ముగించలేదు. కానీ చాహల్ ఉంటే జట్టుకు మరింత ఎక్కువ నష్టం చేసేవాడేమో. అతడి ఎంపిక ఆసక్తికరంగా అనిపించొచ్చు. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తే అంతకంటే ఆసక్తిగా ఉంది' అని దినేష్ కార్తీక్ వెల్లడించారు. టీ20 వరల్డ్ కప్ రవిచంద్రన్ అశ్విన్ ఆరు మ్యాచ్ లు ఆడి 6 వికెట్లు తీసుకున్నారు.