Typhoon Champi: తైవాన్‌ను వణికించిన చాంపీ తుఫాను.. ఒకరు మృతి, 527 మందికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రశాంత మహాసముద్రంలో ఏర్పడిన శక్తివంతమైన చాంపీ తుపాను తైవాన్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. గంటకు 126 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులు, ఎగిసిపడిన సముద్ర అలలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, 527 మందికి పైగా గాయపడ్డారు. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలడంతో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తీర ప్రాంతాల్లో బీభత్సం శనివారం తెల్లవారుజామున తైవాన్ ఈశాన్య తీరాన్ని చాంపీ తుఫాను బలంగా తాకింది. గంటకు 126 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు భారీ వృక్షాలు సైతం కూలిపోయాయి. లియుక్యూ దీవి సమీపంలో సముద్ర అలల ఉధృతికి ఒక వ్యక్తి కొట్టుకుపోయి మరణించాడు. తుఫాను ప్రభావంతో కనీసం 527 మంది గాయపడినట్లు సమాచారం.
వివరాలు
నిలిచిన విద్యుత్ సరఫరా
పెనుగాలుల కారణంగా విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో 1.67 లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
అధికారులు వెంటనే మరమ్మతు పనులు ప్రారంభించి పలు ప్రాంతాల్లో సరఫరాను పునరుద్ధరించారు.
అయినప్పటికీ రాజధాని తైపీతో పాటు ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని పలు నగరాల్లో వర్షాలు, కూలిన చెట్లతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
242 విమాన సర్వీసులు రద్దు
తుఫాను ప్రభావంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
పరిస్థితులు కొంత మెరుగుపడినప్పటికీ శనివారం నాటికి 242 విమాన సర్వీసులను రద్దు చేశారు.
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తైపీతో పాటు పలు ప్రాంతాల్లో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు వరుసగా రెండో రోజు కూడా సెలవు ప్రకటించారు.
వివరాలు
చైనా, జపాన్ వైపు పయనం
ముందస్తు చర్యలు చేపట్టడంతో ప్రాణనష్టాన్ని కొంతవరకు నియంత్రించగలిగినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం తైవాన్‌కు తూర్పున 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాంపీ తుఫాను తీవ్రత కొంత తగ్గినట్లు సమాచారం.
అయితే ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. రానున్న గంటల్లో తుఫాను ఉత్తర దిశగా కదులుతూ చైనా తీర ప్రాంతాల వైపు, ఆ తర్వాత దక్షిణ జపాన్ దిశగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
దీంతో ఆయా ప్రాంతాల తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తైవాన్ తీరాన్ని తాకిన చాంపీ తుఫాను.. ఒకరు మృతి
Keadaan di Taiwan saat ini sedang bersiap menghadapi dampak Topan Champi (Typhoon Champi), yang membuat Badan Cuaca Sentral Taiwan (CWA) telah mengeluarkan peringatan daratan (land warning) resmi. pic.twitter.com/pS5poxsoDO
— jejeee. (@amourphelia) October 22, 2026