LOADING...
Mexico : మెక్సికో బార్‌లో కాల్పుల కలకలం.. 10 మంది మృతి
మెక్సికో బార్‌లో కాల్పుల కలకలం.. 10 మంది మృతి

Mexico : మెక్సికో బార్‌లో కాల్పుల కలకలం.. 10 మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2024
03:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెక్సికోలోని క్వెరెటారో పట్టణంలో బార్‌లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 10 మంది మరణించగా, మరికొందరు గాయపడ్డారు. సాయుధ దుండగులు అకస్మాత్తుగా బార్‌లోకి చొరబడి కస్టమర్లు, సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఈ ప్రమాదంతో నగరంలో హింస మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రాంతీయ వర్గాల మధ్య ఉన్న సంఘర్షణలకు సంబంధించినదై ఉంటుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హింస పెరుగుతున్న నేపథ్యంతో రెండు రోజుల క్రితమే మరో రెస్టారెంట్‌లో ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. తాజా ఘటన క్వెరెటారోలోని బార్ లాస్ కాంటారిటోస్‌లో జరిగింది.

Details

దర్యాప్తు చేపట్టిన పోలీసులు

నివేదికల ప్రకారం, నవంబర్ 9 అర్థరాత్రి నలుగురు సాయుధులు బార్‌లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పోలీసులు ఘటన స్థలాన్ని చుట్టుముట్టి సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. దుండగులు ఎందుకు దాడి జరిపారన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. కానీ గత కొన్ని రోజులుగా ప్రాంతంలో హింసాత్మక ఘటనలు పెరుగుతుండటంతో ఈ ఘటన దానికీ సంబంధించినదై ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాంతంలో భద్రతా చర్యలు మరింత పటిష్టం చేయనున్నట్లు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విచక్షణా రహితంగా దాడులు జరిపిన దుండగలు