
Canada- India Row: కెనడా టొరంటోలో ఇండియన్ సింగర్ ఏరియాలో కాల్పుల కలకలం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-కెనడా దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, టొరంటో నగరంలో కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది.
ఈ ఘటన భారత గాయకుల నివాస ప్రాంతం అయిన రికార్డింగ్ స్టూడియో ఎదుట చోటు చేసుకుంది.
దుండగులు దాదాపు 100 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కెనడా పోలీసులు విచారణ చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం, ముగ్గురు దుండగులు చోరీ చేసిన వాహనంలో వేదిక వద్దకు వచ్చి కాల్పులకు దిగినట్లు తెలిపారు.
స్టూడియోలోని వ్యక్తులు కూడా వాటికి ప్రతిగా ఎదురు కాల్పులు చేశారని పేర్కొన్నారు.
ఈ ఘటనలో 23 మందిని అదుపులోకి తీసుకొని, వారి నుండి 16 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
వివరాలు
ఘటన మూడు రోజుల క్రితంది..
మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ఘటనపై గట్టి భారత ఏజెన్సీలు ,సమాచార సేకరణ చేస్తున్నాయి. కాల్పులు జరిగిన ప్రాంతంలో పంజాబీ గాయకుల నివాసాలు,వారి మ్యూజిక్ స్టూడియోలు ఉన్నాయి.
ఈ కాల్పుల సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కొంతమంది గాయకులు పాటలు ప్లే చేస్తూ,ఆయుధాలతో డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ ఘటన మూడు రోజుల క్రితం జరిగిందని,కెనడా మహిళా పోలీసు అధికారి చెప్పారు.
అలాగే, తాజాగా వాంకోవర్‌లో ప్రముఖ పంజాబీ గాయకుడు ఏపీ. ధిల్లాన్ ఇంటి ఎదుట కూడా కాల్పులు జరిగి, సంబంధిత వీడియో కూడా వైరల్ అయింది.
ఈ రెండు సంఘటనలు కెనడాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులను మరింత తీవ్రమైనదిగా మార్చాయి.