
USA-CHINA: చైనా కి భారీ షాక్ ఇచ్చిన అమెరికా.. చైనా వస్తువులపై 104% సుంకం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా (USA),చైనా (China) మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమవుతోంది.
తాజా పరిణామాలలో,అమెరికా మరోసారి చైనాపై భారీగా సుంకాలు విధించింది.
ఫలితంగా చైనా ఉత్పత్తులపై విధించనున్న మొత్తం సుంకాల శాతం 104కి చేరింది.
ఈ కొత్త సుంకాలు ఏప్రిల్ 9 నుంచి అమలులోకి వస్తాయని శ్వేతసౌధం కార్యదర్శి తెలిపారు.
ఇటీవల చైనాపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించిన నేపథ్యంలో, చైనా కూడా స్పందిస్తూ తమ దేశంలోకి దిగుమతయ్యే అమెరికా వస్తువులపై 34 శాతం అదనపు సుంకాలు విధించాలని నిర్ణయం తీసుకుంది.
వివరాలు
0 శాతం ప్రతీకార సుంకాలను విధిస్తామని ట్రంప్ హెచ్చరిక
ఈ పరిణామాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భగ్గుమన్న విషయం తెలిసిందే.
చైనా, ఏప్రిల్ 8 నాటికి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, 50 శాతం ప్రతీకార సుంకాలను విధిస్తామని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా, అమెరికా నేరుగా 104 శాతం సుంకాలు విధించే నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చైనా వస్తువులపై 104% సుంకం
JUST IN: 🇺🇸🇨🇳 President Trump imposes 104% tariffs on China. pic.twitter.com/qFU2sOHpXP
— Remarks (@remarks) April 8, 2025