Page Loader
Mexico: బార్‌కు నిప్పంటించిన యువకుడు; 11 మంది మృతి
బార్‌కు నిప్పంటించిన యువకుడు; 11 మంది మృతి

Mexico: బార్‌కు నిప్పంటించిన యువకుడు; 11 మంది మృతి

వ్రాసిన వారు Stalin
Jul 23, 2023
12:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర మెక్సికో సరిహద్దు నగరమైన శాన్ లూయిస్ రియో ​​కొలరాడోలోని బార్‌కి ఓ యువకుడు నిప్పంటించాడు. ఈ ప్రమాదంలో దాదాపు 11మంది మరణించారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు బార్ నుంచి బయటకు పంపించడంతో ఆగ్రహానికి గురైన అతను మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టాడు. నిందితుడు ఒక రకమైన మోలోటోవ్ కాక్టెయిల్‌ను బార్ తలుపుల వద్ద విసిరాడు. తర్వాత నిప్పుంటించడంతో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. బార్ నిర్మాణంలో చెక్క ఎక్కువ ఉండటంతో మంటలు దావానంలా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 11మంది మరణించారు. మరణించిన వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. మరో మరో నలుగురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు నగర మేయర్ శాంటోస్ గొంజాలెజ్ తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాక్టెయిల్‌తో బార్‌కు నిప్పు