Page Loader
బంగ్లాదేశ్‌లో 12హిందూ దేవాలయాలపై దాడి, విగ్రహాల ధ్వంసం
బంగ్లాదేశ్‌లో 12హిందూ దేవాలయాలపై దాడి, విగ్రహాల ధ్వంసం

బంగ్లాదేశ్‌లో 12హిందూ దేవాలయాలపై దాడి, విగ్రహాల ధ్వంసం

వ్రాసిన వారు Stalin
Feb 06, 2023
11:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ దేశాల్లో ఇటీవల హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. వాయువ్య బంగ్లాదేశ్‌లోని 12 హిందూ దేవాలయాల్లోని విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. దుండగుల ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బంగ్లాదేశ్‌లోని ఉత్తర ఠాకూర్‌గావ్ జిల్లాలో బలియాడంగీ పరిధిలోని 12 హిందూ దేవాలయాల్లో గుర్తు తెలియని దుండగులు 14 విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ దేవాలయాలు దంతల, పరియా, చారుల్ యూనియన్‌లలో ఉన్నాయి.

బంగ్లాదేశ్

ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు: పోలీసులు

ఈ దాడులను సీరియస్‌గా తీసుకున్న యంత్రాంగం దుండగుల కోసం గాలిస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాలను సందర్శించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అదనపు భద్రత కోసం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. పరిస్థితి అదుపులోనే ఉందని ప్రకటించారు. సుమారు యాభై ఏళ్లుగా ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నామని, ఇన్నేళ్లుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, విధ్వంసానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని దంతల యూనియన్ పూజ ఉజ్జపోన్ కమిటీ ప్రధాన కార్యదర్శి జోతిర్మయ్ సింగ్ డిమాండ్ చేశారు.