
Mexico Gang Clash: మెక్సికోలో రెండు క్రిమినల్ ముఠాల ఘర్షణ..12 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
మెక్సికోలోని దక్షిణ రాష్ట్రమైన గెరెరోలో రెండు క్రిమినల్ ముఠాల మధ్య జరిగిన ఘర్షణలో కనీసం 12 మంది మరణించారని అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ బుధవారం తెలిపారు.
ఈ ఘటనపై మంగళవారం నాడు విచారణ ప్రారంభమైంది.. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని ఒబ్రాడోర్ బుధవారం నాడు జరిగిన ప్రెస్ సమావేశంలో తెలిపారు.
నేషనల్ గార్డ్ దళాలు ఇప్పటికే సైట్‌లోఉన్నారన్నారు. ఈ ఘోరమైన ఘర్షణపై అధికారులు తదుపరి విచారణలో మరిన్ని వివరాలను అందజేస్తారని అధ్యక్షుడు ఒబ్రాడోర్ చెప్పారు.
ఇటువంటి ఘటనలను ఉపేక్షించేంది లేదని ఆయన పేర్కొన్నారు.
ఘటన జరగడంపై క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు.తొందరలోనే నిందితులను పట్టుకుంటాని అధ్యక్షుడు ఒబ్రాడోర్ చెప్పుకొచ్చారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మెక్సికోలో రెండు క్రిమినల్ ముఠాల మధ్య ఘర్షణ
At least 12 people killed in #Mexico gang clash: Presidenthttps://t.co/9H8mh6higr
— Kalinga TV (@Kalingatv) February 22, 2024