Teachers Rape 15 Minor: షాకింగ్ న్యూస్.. 15 మంది మగ విద్యార్థులపై ఇద్దరు టీచర్ల అత్యాచారం
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మదర్సాకు చెందిన ఇద్దరు టీచర్లు 15మంది మగ విద్యార్థులపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. లాహోర్‌కు 275 కిలోమీటర్ల దూరంలోని చక్వాల్ జిల్లాలో ఈ ఘటన జరిగిందని పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) ఉస్మాన్ అన్వర్ తెలిపారు. నిందితులిద్దరినీ జీషన్, అనిస్‌గా గుర్తించామని చెప్పారు. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మదర్సాలో 10 నుంచి 12 ఏళ్లలోపు 15 మంది మగ విద్యార్థులపై ఇద్దరు టీచర్లు అత్యాచారం చేశారని ఐజీపీ తెలిపారు. అయితే అత్యాచారం చేసిన బాధితుల సంఖ్య విచారణ సమయంలో మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ దారుణం ఎలా వెలుగులోకి వచ్చిందంటే..
ఈ కేసులో మొత్తం 15 మంది బాధిత విద్యార్థులు, వారి కుటుంబాల వాంగ్మూలాలను నమోదు చేసినట్లు ఐజీపీ తెలిపారు. విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించిగా.. అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. బాధిత విద్యార్థుల్లో ఒకరు తన తండ్రికి ఈ విషయాన్ని చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కొడుకును చూసేందుకు శుక్రవారం మదర్సాకు వెళ్లినట్లు విద్యార్థి తండ్రి తెలిపాడు. తనను చూసి కొడుకు కన్నీళ్లు పెట్టుకున్నాడని, ఎందుకు ఏడుస్తున్నావని అడగ్గా.. ఉపాధ్యాయులు అత్యాచారంతో హింసించినట్లు చెప్పాడని తండ్రి పోలీసులకు వివరించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా.. బాధితులు చాలా మంది ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 15 మంది బాధితులను గుర్తించగా.. మరింత మంది పెరిగే అవకాశం ఉంది.