Loading...
South Korea:160 ప్రశ్నలకు 159 సరైన సమాధానాలు.. దక్షిణ కొరియా విద్యాశాఖ మంత్రి రాజీనామా
160 ప్రశ్నలకు 159 సరైన సమాధానాలు.. దక్షిణ కొరియా విద్యాశాఖ మంత్రి రాజీనామా

South Korea:160 ప్రశ్నలకు 159 సరైన సమాధానాలు.. దక్షిణ కొరియా విద్యాశాఖ మంత్రి రాజీనామా

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 23, 2026
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ కొరియాలో విద్యార్థుల పరీక్షల్లో కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో కాపీయింగ్‌ చేసిన ఘటన రాజకీయంగా వివాదానికి దారితీసింది. ఓ అభ్యర్థి ఏఐ సాంకేతికతను ఉపయోగించి పరీక్షలో అక్రమాలకు పాల్పడినట్లు అంగీకరించడంతో ఆ దేశ విద్యాశాఖ మంత్రి చోయ్‌ క్యో-జిన్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. నవంబర్‌ 15న నిర్వహించిన జాతీయ ట్యాక్స్‌ అకౌంటెంట్‌ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన ఓ అభ్యర్థి కాపీయింగ్‌కు పాల్పడినట్లు అంగీకరించడంతో ఈ వివాదం మొదలైంది. సూక్ష్మ కెమెరా, స్మార్ట్‌ఫోన్‌ సాయంతో పరీక్షలో దాదాపు పూర్తి మార్కులు సాధించినట్లు అతడు వెల్లడించాడు. ఈ ఘటన పరీక్షల నిర్వహణలో భద్రత, పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తింది.

వివరాలు 

స్పందించిన విద్యాశాఖ మంత్రి చోయ్‌ క్యో-జిన్

మరోవైపు, దేశంలో అత్యంత కీలకమైన పరీక్షల్లో ఒకటిగా భావించే తొమ్మిది గంటల సునెంగ్‌ పరీక్షలోనూ కాపీయింగ్‌ ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది.

ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి చోయ్‌ క్యో-జిన్‌ స్పందించారు.

ప్రజల విమర్శలకు తాను అతీతుడిని కాదని, ప్రజల్లో విద్యావ్యవస్థపై నమ్మకాన్ని తిరిగి పెంచేందుకు రాజీనామా చేస్తున్నట్లు ఎక్స్‌ (X) వేదికగా ప్రకటించారు.

గురువారం నిర్వహించిన పరీక్షలో మొత్తం 111 చోట్ల అక్రమాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

పరీక్షల్లో అక్రమాలు, ఏఐ వినియోగం వంటి అంశాలు దక్షిణ కొరియా విద్యావ్యవస్థలో కొత్త చర్చకు తెరతీశాయి.

ADVERTISEMENT