Page Loader
Gaza: గాజాలో ఒకే కుటుంబంలో 18 మంది మృతి
గాజాలో ఒకే కుటుంబంలో 18 మంది మృతి

Gaza: గాజాలో ఒకే కుటుంబంలో 18 మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2024
09:03 am

ఈ వార్తాకథనం ఏంటి

గాజాలో ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గాజాలోని జువైదా పట్టణంపై ఇజ్రాయెల్ తాజాగా చేసిన దాడుల్లో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మరణించినట్లు అల్-అక్సా ఆస్పత్రి ధ్రువీకరించింది. సమీ జవాద్ అల్-ఎజ్లా అనే వ్యాపారి, అతడి ఇద్దరి భార్యలు, 11 మంది పిల్లలు, మరో నలుగురు కుటుంబీకులు మృత్యువాత పడినట్లు పేర్కొంది. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.

Details

ప్రావిన్స్‌లో 10 మంది మృతి

మరోవైపు లెబనాల్‌లోని ప్రావిన్స్‌లో జరిపిన దాడుల్లో 10మంది మరణించగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హెజ్‌బొల్లాకు చెందిన ఆయుధ నిల్వ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగినట్లు ఇజ్రాయెల్ ప్రతినిధి తెలిపారు. టైర్ నగరంలో జరిపిన దాడుల్లో ఓ కమాండర్‌ను హతమార్చినట్లు వెల్లడించారు. అయితే అతడి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్, హమాస్ మధ్య చర్చలు అసంపూర్తిగా ముగిసిన విషయం తెలిసిందే.