LOADING...
Nepal: నేపాల్‌లో ఘోర బస్సు ప్రమాదం.. నదిలో పడిన బస్సు.. 18 మంది మృతి
Nepal: నేపాల్‌లో ఘోర బస్సు ప్రమాదం.. నదిలో పడిన బస్సు.. 18 మంది మృతి

Nepal: నేపాల్‌లో ఘోర బస్సు ప్రమాదం.. నదిలో పడిన బస్సు.. 18 మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 23, 2026
08:51 am

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధాడింగ్‌ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడిపోవడంతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. పొఖారా నుండి కాఠ్‌మాండూ వైపు ప్రయాణిస్తున్న ఈ బస్సు సోమవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. నియంత్రణ కోల్పోయిన వాహనం త్రిశూలీ నదిలోకి దూసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 27 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నదిలో పడిన బస్సు.

Advertisement