LOADING...
US-Iran 'war':అమెరికా-ఇరాన్ యుద్ధం..ముగ్గురు అమెరికన్ సైనికులు మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు
అమెరికా-ఇరాన్ యుద్ధం..ముగ్గురు అమెరికన్ సైనికులు మృతి..

US-Iran 'war':అమెరికా-ఇరాన్ యుద్ధం..ముగ్గురు అమెరికన్ సైనికులు మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 01, 2026
08:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికాకు భారీ దెబ్బ తగిలింది. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటన ప్రకారం,యుద్ధంలో ముగ్గురు అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ మరణాలు,గాయాలకు దారితీసిన పరిణామాలపై CENTCOM పూర్తి వివరాలు వెల్లడించలేదు. నిన్నటి ముంది ఇరాన్ మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపినట్లు సమాచారం. మరికొంతమంది సైనికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. పేలుళ్ల వల్ల లోహపు ముక్కలు తగిలి గాయాలయ్యాయని, కొందరికి తలకు కూడా దెబ్బలు తగిలినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో కొందరిని తిరిగి విధుల్లోకి పంపించే ప్రక్రియ కొనసాగుతోందని CENTCOM స్పష్టం చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇరాన్ దాడుల్లో అమెరికాకు చెందిన ముగ్గురు సైనికులు మృతి!

Advertisement