NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Iran: ఇరాన్‌లో ముగ్గురు భారతీయులు అదృశ్యం.. ఆందోళనలో కుటుంబ సభ్యులు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Iran: ఇరాన్‌లో ముగ్గురు భారతీయులు అదృశ్యం.. ఆందోళనలో కుటుంబ సభ్యులు

    Iran: ఇరాన్‌లో ముగ్గురు భారతీయులు అదృశ్యం.. ఆందోళనలో కుటుంబ సభ్యులు

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 28, 2025
    05:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బతుకుదెరువు కోసం ఇరాన్‌కి వెళ్లిన ముగ్గురు భారతీయులు అదృశ్యమైన ఘటన పంజాబ్‌లో కలకలం రేపుతోంది.

    వారితో ఎలాంటి సంబంధం లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

    తమ బిడ్డల గురించి సమాచారం తెలియజేయాలని కోరుతూ వారు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించారు.

    అదృశ్యమైన వారు పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన హుషన్‌ప్రీత్ సింగ్ (సంగ్రూర్),జస్పాల్ సింగ్ (ఎస్‌బీఎస్ నగర్),అమృతపాల్ సింగ్ (హోషియార్‌పూర్)గా గుర్తించారు.

    వీరు హోషియార్‌పూర్కు చెందిన ఓ ఏజెంట్‌ సహకారంతో మే 1న ఇరాన్‌కు వెళ్లినట్టు సమాచారం.

    కానీ ఇరాన్‌కు చేరిన వెంటనే గుర్తు తెలియని వ్యక్తులు వారిని అపహరించి, చేతులను తాళ్లతో కట్టి వారి ఫోటోలు కుటుంబ సభ్యులకు పంపించారు.

    వివరాలు 

    కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్న ఎంబసీ అధికారులు

    వీరిని విడిచిపెట్టేందుకు రూ. కోటి చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.మే 11 తర్వాత నుండి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు మరింత ఆందోళనకు గురయ్యారు.

    ఈవిషయాన్ని తెలుపుతూ వారు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా, ఎంబసీ అధికారులు వెంటనే స్పందించి సంబంధిత సమాచారం ఇరాన్ ప్రభుత్వానికి అందజేశారు.

    ముగ్గురి ఆచూకీ వెలికితీయాలని వారు ఇరాన్ అధికారులను కోరారు.

    ఈప్రక్రియలో ఎంబసీ అధికారులు ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు తాజా వివరాలను అందజేస్తున్నారని తెలుస్తోంది.

    అయినప్పటికీ ఇంకా తమ బిడ్డల జాడ తెలియకపోవడం కుటుంబాలను భయాందోళనకు గురి చేస్తోంది.

    ఇక ఈముగ్గురు యువకులను దుబాయ్‌-ఇరాన్ మార్గంలో ఆస్ట్రేలియాకు పంపిస్తానని హామీ ఇచ్చి, హోషియార్‌పూర్‌కు చెందిన ఓ ఏజెంట్‌ తీసుకెళ్లినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

    వివరాలు 

    ఇరాన్‌ పోలీసులు గాలింపులు

    మొదట్లో ఇరాన్‌లో తాత్కాలిక బస కల్పిస్తానని కూడా ఏజెంట్ హామీ ఇచ్చినట్లు చెప్పారు.

    కానీ మే 1న ఇరాన్‌కు అడుగుపెట్టిన వెంటనే ముగ్గురిని కిడ్నాప్ చేసిన ఘటన చోటు చేసుకుంది.

    అప్పటినుంచి ఆ ఏజెంట్ కూడా కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

    ప్రస్తుతం అతని ఆచూకీ కోసం వారు తీవ్రంగా గాలిస్తున్నారని చెప్పారు. ఏజెంట్ గురించి సమాచారం లభిస్తే తమ బిడ్డల జాడ తెలిసే అవకాశముందని భావిస్తున్నారు.

    కిడ్నాపర్లు డైరెక్ట్‌గా ఫోన్ చేసి రూ. కోటి డిమాండ్ చేస్తూ బెదిరించారని వారు వెల్లడించారు.

    ప్రస్తుతం ఈ ముగ్గురు యువకుల ఆచూకీ కోసం ఇరాన్‌ పోలీసులు గాలింపులు కొనసాగిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇరాన్

    తాజా

    Iran: ఇరాన్‌లో ముగ్గురు భారతీయులు అదృశ్యం.. ఆందోళనలో కుటుంబ సభ్యులు ఇరాన్
    OG: ఓజీ సెట్స్‌లో పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ వైరల్  పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: ఒక రూపాయితో కోటీశ్వరుడవ్వడం సాధ్యమేనా..?.. ఫాంటసీ క్రికెట్ యాప్స్ మాయలో పడుతున్న భారత యువత బెట్టింగ్‌ యాప్స్‌
    Indian Army New Act: త్రివిధ దళాలకు ఉమ్మడి కమాండ్.. ఇంటర్-సర్వీసెస్ చట్టానికి గెజిట్ నోటిఫికేషన్ ఆర్మీ

    ఇరాన్

    Israel-Hezbollah:హెజ్‌బొల్లాల కీలకనేతపై గురి.. డమాస్కస్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయ సమీపంలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు  ఇజ్రాయెల్
    Iran: ఇరాన్‌‌పై అమెరికా కఠిన చర్యలు.. పెట్రోలియం, పెట్రోకెమికల్ రంగాలపై ఆంక్షల విస్తరణ అమెరికా
    Cyberattacks: అణుస్థావరాలే లక్ష్యంగా భారీగా సైబర్ దాడులు.. ఇరాన్ ప్రభుత్వ సేవలకు అంతరాయం అమెరికా
    Netanyahu: ఇరాన్ చమురు, అణు స్థావరాలపై దాడి చేయబోం :అమెరికాకి ఇజ్రాయెల్ హామీ..!    బెంజమిన్ నెతన్యాహు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025