Page Loader
మెక్సికోలో భారీగా పరికరాల పేలుడు.. ముగ్గురు పోలీసుల మృతి, మరో 10 మందికి గాయాలు
ముగ్గురు పోలీసుల మృతి, మరో 10 మందికి గాయాలు

మెక్సికోలో భారీగా పరికరాల పేలుడు.. ముగ్గురు పోలీసుల మృతి, మరో 10 మందికి గాయాలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 12, 2023
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెక్సికోలో భారీ పేలుడు సంభవించింది. సెంట్రల్ మెక్సికన్ పరిధి జాలిస్కోలోని మార్కెట్ ప్రాంతంలో పరికరాలు పేలిన కారణంగా ముగ్గురు పోలీస్ అధికారులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మరో 10 మంది గాయపడ్డారని గవర్నర్ ఎన్రిక్ అల్ఫారో ప్రకటించారు. పరికరాల పేలుడు ధాటికి మున్సిపల్ విభాగం,ప్రాసిక్యూటర్ కార్యాలయానికి చెందిన ముగ్గురు పోలీస్ సహోద్యోగులు మరణించారని ఎన్రిక్ అల్ఫారో వెల్లడించారు. వ్యవస్థీకృత నేర సమూహాల సామర్థ్యాన్ని ఈ సంఘటన ప్రస్ఫూటించిదన్నారు. ఈ ఘటన వల్ల మొత్తం మెక్సికన్ రాష్ట్రంలోనే అలజడులు చెలరేగాయని పేర్కొన్నారు. బహుశ మార్కెట్‌లోని విక్రేతలు, యజమానుల మధ్య వివాద ఫలితంగానే ఈ దారుణం జరిగి ఉండవచ్చని టోలుకా మేయర్ రేముండో మార్టినెజ్ మిలెనియో అన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సెంట్రల్ మెక్సికన్ సిటీలో భారీ పేలుడు