Loading...
North Carolina: నార్త్ కరోలినాలో మాస్ షూటింగ్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం
నార్త్ కరోలినాలో మాస్ షూటింగ్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం

North Carolina: నార్త్ కరోలినాలో మాస్ షూటింగ్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 06, 2026
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో మరోసారి తుపాకి కాల్పుల ఘటన కలకలం రేపింది. నార్త్ కరోలినాలోని కాస్వెల్ కౌంటీలో ఓ ఇంట్లో జరిగిన మాస్ షూటింగ్‌లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం సుమారు 8గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఘటనాస్థలిలో పలువురు తుపాకి గాయాలతో పడి ఉండగా పోలీసులు గుర్తించారు. వారిలో ఒకరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా,మరికొందరు అప్పటికే మృతి చెందినట్లు నార్త్ కరోలినా స్టేట్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వెల్లడించింది. కాస్వెల్ కౌంటీ షెరిఫ్ టోనీ డర్డెన్ తెలిపిన వివరాల ప్రకారం,ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

వివరాలు 

ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు

మృతుల్లో కాల్పులకు పాల్పడిన నిందితుడు కూడా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

అదే కుటుంబానికి చెందిన మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సంఘటన స్థలంలో ఆధారాలు సేకరిస్తూనే, కేసుకు సంబంధించిన వివరాల కోసం పలువురిని ప్రశ్నిస్తున్నారు.

కాల్పులకు దారితీసిన కారణాలు ఏమిటన్న అంశంపై విచారణ కొనసాగుతోంది.

వివరాలు 

దేశంలో గన్ కల్చర్‌పై ఆందోళన

అమెరికాలో తుపాకి హింస వరుసగా చోటుచేసుకుంటుండటం మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది.

ఇటీవల ఆగస్టు 2న ఒరెగాన్ రాష్ట్రంలోని పోర్ట్‌ల్యాండ్‌లో జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు.

అంతకుముందు ఆగస్టు 1న ఇడాహోలో జరిగిన మరో కాల్పుల ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

ఈ వరుస సంఘటనలు అమెరికాలో గన్ కల్చర్, తుపాకుల నియంత్రణపై చర్చలను మరింత ఉధృతం చేస్తున్నాయి.

ADVERTISEMENT