తదుపరి వార్తా కథనం

Israel Hamas Conflict: గాజా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు 350 సంవత్సరాలు.. ఐరాస నివేదిక
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 23, 2024
05:13 pm
ఈ వార్తాకథనం ఏంటి
హమాస్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ గాజాలో భారీ విధ్వంసం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో ఇప్పటికే 66 శాతానికి పైగా ఇళ్లు, ఆస్పత్రులు, ఇతర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి.
భవిష్యత్తులో మరెన్నో దాడులు జరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో గాజాను పునర్నిర్మించడానికి దశాబ్దాల సమయం అవసరమవుతుందని ఐక్యరాజ్య సమితి ఏజెన్సీలు హెచ్చరిస్తున్నాయి.
ఇక యుద్ధం వల్ల కూప్పకూలిన గాజా ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడానికి సుమారు 350 సంవత్సరాలు పట్టే అవకాశాలున్నాయని ఐరాస ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి.