
Earthquake: అమెరికాలో మరోసారి భూప్రకంపనలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని న్యూయార్క్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది.
సమాచారం ప్రకారం,న్యూజెర్సీలో భూకంప తీవ్రత 4.8 గా నమోదైనట్లు అమెరికా భూభౌతిక పరిశోధన సంస్థ (USGS) తెలిపింది.
న్యూ జెర్సీలోని వైట్‌హౌస్ స్టేషన్‌కు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించామని వెల్లడించింది.
అయితే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం జరగలేదు. అయితే ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
ఉత్తర కాలిఫోర్నియాలో కూడా భూకంపం సంభవించింది. ఇక్కడ 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.
విశేషమేమిటంటే..ఈ భూకంపం ఒకటి రెండు సార్లు కాదు.. వేర్వేరు సమయాల్లో 7 సార్లు భూకంపాలు సంభవించాయి.
ఒకదాని తర్వాత ఒకటిగా భూకంపాలు వస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
భూకంపం
మయన్మార్‌లో భూకంపం
ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు.
అయితే ఇక్కడ కూడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
శుక్రవారం కూడా మయన్మార్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదైంది.
కొద్ది రోజుల క్రితం తైవాన్‌లో భారీ భూకంపం వచ్చింది. ఇందులో చాలా మంది చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
గత 25 ఏళ్లలో తైవాన్‌లో ఇంత ప్రమాదకరమైన భూకంపం సంభవించింది .
ఇందులో చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. అధికారులు అప్రమత్తమై సహాయ చర్యలు చేపట్టారు. శిథిలాలు తొలగించారు. పరిస్థితుల్ని చక్కబెట్టారు.
భారత్‌లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.