
Canada: ముగిసిన గడువు.. భారత్‌ను వీడిన 41 మంది కెనడా దౌత్యవేత్తలు
ఈ వార్తాకథనం ఏంటి
ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత ప్రమేయం ఉందంటూ ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసింది.
ఈ ఆరోపణలో భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
ఈ నేపథ్యంలో తమ దేశంలోని 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని భారత్ ఆదేశించింది.
అక్టోబర్ 10లోగా 41 మంది దౌత్యవేత్తలను రీకాల్ చేయాలని కెనడాను భారత్ స్పష్టం చేసింది.
ఇక కేంద్రం విధించిన డెడ్ లైన్ ముగియడంతో భారత్ లోని తమ దౌత్యవేత్తలను తరలించినట్లు కెనడా ప్రకటించింది.
ఈ మేరకు 41 మంది కెనడా దౌత్యవేత్తలు భారత్ ను వీడినట్లు కెనడా స్పష్టం చేసింది.
Details
ఘాటు విమర్శలు చేసిన కెనడా విదేశాంగ శాఖ మంత్రి
ఈ పరిణామాలపై కెనడా విదేశాంగ శాఖ మంత్రి మెలానీ జోలీ ఘాటు విమర్శలు చేశారు.
కెనడా దౌత్యవేత్తల గుర్తింపును భారత్ ఉపసంహరించుకోవడం అనైతిక, అసాధారణ చర్యగా అభివర్ణించారు.
దౌత్య సంప్రదాయాలకు సంబంధించి వియన్నా ఒడంబడికను భారత్ ఉల్లంఘించిందని విమర్శించారు.
దౌత్యవేత్తల గుర్తింపు రద్దుతో భద్రతాపరమైన సమసయలు తలెత్తే అవకాశం ఉందని, అందుకే వారిని స్వదేశానికి తరలించామని చెప్పారు.
దౌత్య గుర్తింపు రద్దు లాంటి నిర్ణయాలతో ప్రపంచంలోని ఏ దౌత్యవేత్తా క్షేమంగా ఉండరని, కావున తాము భారత దౌత్యవేత్తల విషయంలో ఇలాంటి చర్యను చేపట్టమని మెలానీ జోలీ పేర్కొన్నారు.