
Israel attack :రఫా నగరంపై ఇజ్రాయెల్ సేనల దాడులు.. 42 మంది మృతి.. పెల్లుబికిన నిరసనలు
ఈ వార్తాకథనం ఏంటి
పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌లో ఉన్న రఫా నగరంపై ఇజ్రాయెల్ సేనలు మరోసారి దాడికి పాల్పడ్డాయి.
హమాస్ మిలిటెంట్‌లతో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
తాజాగా గాజాకు దక్షిణ నగరమైన రఫాలోని పాలస్తీనియన్‌ల శరణార్థి శిబిరాలపై సేనలు దాడికి పాల్పడ్డాయి.
ఈ దాడిలో 42 మంది పాలస్తీనియన్‌లు మరణించారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.
వివరాలు
క్షతగాత్రులకు అల్ అహ్లీ ఆస్పత్రిలో చికిత్స
క్షతగాత్రులు అల్ అహ్లీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. 30 మృతదేహాలను తమ ఆస్పత్రికి తీసుకువచ్చారని, గాజా నగరానికి ఇది దారుణమైన రోజు అని అల్-అహ్లీ హాస్పిటల్ ఆర్థోపెడిక్ హెడ్ ఫడేల్ నయీమ్ వ్యాఖ్యానించారు.
తీర ప్రాంతంలోని రెండు ప్రదేశాల్లో బాంబు దాడుల అనంతరం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రఫాలోని సివిల్ డిఫెన్స్ ప్రతినిధి అహ్మద్ రద్వాన్ తెలిపారు.
కాగా ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన, గాయపడిన వారి వివరాలను గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
వివరాలు
మువాసి పరిధిలో ఇజ్రాయెల్ బాంబు దాడి
మీడియాకు అందిన వివరాల ప్రకారం.. మువాసి పరిధిలో ఇజ్రాయెల్ బాంబు దాడి చేసింది. పాలస్తీనియన్లకు ఇక్కడ రక్షణ శిబిరాలు ఉన్నాయి.
ఇజ్రాయెల్ బలగాలు రెండుసార్లు దాడులకు తెగబడ్డాయని బాధితులు తెలిపారు.మరోవైపు తమ దేశ పౌరుల మరణాలకు ఉగ్రవాదులే కారణమని ఇజ్రాయెల్ ఆరోపించింది.
ఉగ్రవాదులు జనం మధ్య తిరుగాడుతున్నారని, అందుకే ఈ దాడుల్లో పౌరులు కూడా మరణిస్తున్నారని ఇజ్రాయెల్ చెబుతోంది.
వివరాలు
ఇజ్రాయెల్ చర్యహేయం,జీపుకు కట్టివేసిన వీడియో వైరల్
ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ నగరమైన జెనిన్‌లో, ఇజ్రాయెల్ దళాలు అరెస్టు చేసిన దాడిలో గాయపడిన పాలస్తీనియన్ వ్యక్తిని సైనిక జీపుకు కట్టివేశాయి.
ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వ్యక్తిని రెండు అంబులెన్స్‌ల గుండా జీపుకు కట్టివేసినట్లు చూపించింది.
ఇజ్రాయెల్ సైన్యం ప్రోటోకాల్ ఉల్లంఘనను అంగీకరించింది . సంఘటనపై దర్యాప్తు చేస్తామని పేర్కొంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే
El ejército sionista disparó a un joven palestino esta mañana y luego lo ató al capó del jeep militar, paseándolo como un trofeo de caza mientras se desangraba, por el barrio de Jabriyat, en Jenin (Cisjordania).
— Daniel Mayakovski (@DaniMayakovski) June 22, 2024
Usaron al joven de escudo humano y evitaron que las ambulancias le… pic.twitter.com/UiJT9m8ZcE