Loading...
Los Angeles Earthquake: అమెరికాలో 5.0 తీవ్రతతో భూకంపం.. లాస్‌ ఏంజెల్స్‌ విమానాశ్రయం ధ్వంసం
రికాలో 5.0 తీవ్రతతో భూకంపం.. లాస్‌ ఏంజెల్స్‌ విమానాశ్రయం ధ్వంసం

Los Angeles Earthquake: అమెరికాలో 5.0 తీవ్రతతో భూకంపం.. లాస్‌ ఏంజెల్స్‌ విమానాశ్రయం ధ్వంసం

వ్రాసిన వారు Balachander Sharma
Nov 29, 2026
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా తీరాన్ని 5.0 తీవ్రతతో భూకంపం కుదిపేసింది. శనివారం సంభవించిన ఈ ప్రకంపనల ప్రభావం లాస్‌ ఏంజెల్స్‌ ప్రాంతంలో స్పష్టంగా కనిపించింది. మాన్‌హట్టన్‌ బీచ్‌ తీరానికి సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే (USGS) తెలిపింది. భూకంపం ధాటికి కిటికీలు కంపించగా, లాస్‌ ఏంజెల్స్‌ విమానాశ్రయంలో కొన్ని అద్దాలు పగిలాయి. మరోవైపు సమీపంలోని రిఫైనరీలో భద్రతా వ్యవస్థలు అప్రమత్తమై మంటలు, పొగ కనిపించాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా భారీ నష్టం నమోదుకాలేదు.

Details

ల్యాండింగ్‌కు ముందే విమానం వెనక్కి

భూకంపం సంభవించిన సమయంలో లాస్‌ ఏంజెల్స్‌ విమానాశ్రయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

రన్‌వేపై దిగేందుకు సిద్ధమైన డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని చివరి క్షణంలో ల్యాండింగ్‌ నిలిపివేసి వెనక్కి మళ్లించారు.

భూకంపం కారణంగా రన్‌వేపై ఏదైనా పగులు ఏర్పడి ఉండొచ్చన్న అనుమానంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

విమానాశ్రయంలోని ఓ టెర్మినల్‌లో కిటికీలు పగలడంతోపాటు ఓ తెల్లటి సీలింగ్‌ ప్యానెల్‌ కూడా కిందపడింది. ప్రయాణికుల్లో కొందరు భయపడినా, పరిస్థితి కొద్దిసేపటికే అదుపులోకి వచ్చింది.

Details

రిఫైనరీలో మంటలు.. భద్రతా చర్యలు

భూకంపం తర్వాత దక్షిణ కాలిఫోర్నియాలోని చెవ్రాన్‌ రిఫైనరీలో భద్రతా చర్యలు ప్రారంభమయ్యాయి.

వ్యవస్థలో ప్రమాదం తలెత్తకుండా ఆటోమేటిక్‌ సేఫ్టీ ఫ్లేరింగ్‌ యాక్టివేట్‌ కావడంతో మంటలు, పొగ కనిపించాయి.

అయితే పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉందని, ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని కంపెనీ వెల్లడించింది.

మరోవైపు లాస్‌ ఏంజెల్స్‌ ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ 'ఎర్త్‌క్వేక్‌ మోడ్‌'లోకి వెళ్లింది. 100కుపైగా ఫైర్‌ స్టేషన్ల సిబ్బంది భూమి, గాలి, సముద్ర మార్గాల్లో కీలక మౌలిక వసతులను పరిశీలించారు.

ADVERTISEMENT

Details

వరుస ప్రకంపనలు.. అప్రమత్తంగా ఉండాలని సూచన

ప్రధాన భూకంపం తర్వాత వరుసగా ఆఫ్టర్‌షాక్స్‌ నమోదయ్యాయి. కాలిఫోర్నియా గవర్నర్‌ కార్యాలయం స్థానిక అధికారులతో కలిసి పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు తెలిపింది.

భూకంపాలు ఎప్పుడు, ఎలా సంభవిస్తాయో ఖచ్చితంగా చెప్పలేమని, ఆఫ్టర్‌షాక్స్‌ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

భూకంప శాస్త్రవేత్త లూసీ జోన్స్‌ ప్రకారం, లాస్‌ ఏంజెల్స్‌ ప్రాంతంలో కొంతకాలంగా నమోదైన పెద్ద ప్రకంపనల్లో ఇది ఒకటి.

కాలిఫోర్నియా భూకంపాలకు కొత్తది కాకపోయినా, 1994 నార్త్‌రిడ్జ్‌ భూకంపం వంటి ఘటనలు ఈ ప్రాంత ప్రజలకు ఇప్పటికీ గుర్తుండిపోయే విషాద జ్ఞాపకాలే.

ADVERTISEMENT