Loading...
Kenya: కెన్యాలో విషాదం.. పర్వత ప్రాంతంలో హెలికాప్టర్‌ కూలి ఏడుగురు మృతి
కెన్యాలో విషాదం.. పర్వత ప్రాంతంలో హెలికాప్టర్‌ కూలి ఏడుగురు మృతి

Kenya: కెన్యాలో విషాదం.. పర్వత ప్రాంతంలో హెలికాప్టర్‌ కూలి ఏడుగురు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2026
08:30 am

ఈ వార్తాకథనం ఏంటి

కెన్యాలో ఘోర హెలికాప్టర్‌ ప్రమాదం చోటుచేసుకుంది. సఫారీ ప్రయాణంలో ఉన్న హెలికాప్టర్‌ ఒక్కసారిగా కుప్పకూలడంతో అందులో ఉన్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఈక్వెడార్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ మిచెల్‌ సెన్సీ-కాంటూగి, ఆయన భార్య స్టెఫనీ హోలిహాన్‌తో పాటు ఐదుగురు అమెరికా పౌరులు ఉన్నారు. ఉత్తర కెన్యాలోని మారుమూల పర్వత ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. కెన్యా పౌర విమానయాన సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. లోయిసాబా కన్జర్వెన్సీ నుంచి ఎవాసో న్యిరో ప్రాంతానికి హెలికాప్టర్‌ బయలుదేరింది. ఉదయం 9.13 గంటల సమయంలో సాంబురు కౌంటీలోని పర్వత ప్రాంతంలో అది ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో హెలికాప్టర్‌లో ఆరుగురు ప్రయాణికులు, ఒక పైలట్‌ ఉన్నారు.

వివరాలు 

ఐదుగురు అమెరికన్లు మృతి

ప్రమాద సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి.

అయితే హెలికాప్టర్‌లో ఉన్న ఏడుగురూ మృతి చెందినట్లు సాంబురు పోలీసు కమాండర్‌ డేవిడ్‌ న్కోరోయ్‌ తెలిపారు.

ప్రమాదంలో ఐదుగురు అమెరికా పౌరులు మరణించినట్లు అమెరికా విదేశాంగ శాఖ ధ్రువీకరించింది.

మృతుల్లో ఈక్వెడార్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ మిచెల్‌ సెన్సీ-కాంటూగి, ఆయన సతీమణి స్టెఫనీ హోలిహాన్‌ కూడా ఉన్నారు.

మృతుల కుటుంబాలకు అమెరికా రాయబార కార్యాలయం సానుభూతి తెలిపింది.

స్థానిక అధికారులతో కలిసి బాధిత కుటుంబాలకు అవసరమైన కాన్సులర్‌ సహాయం అందిస్తున్నట్లు పేర్కొంది.

వివరాలు 

ఐదుగురు అమెరికన్లు మృతి

మృతుల పూర్తి వివరాలను అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

అయితే ఫ్లోరిడాకు చెందిన టెలిముండో మీడియా సంస్థకు చెందిన ఉన్నతాధికారి జోసే సువారెజ్‌ కూడా మృతుల్లో ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఆయన వయసు 55 సంవత్సరాలు.

టెలిముండో ఫ్లోరిడా స్టేషన్లకు అధ్యక్షుడిగా, జనరల్‌ మేనేజర్‌గా సువారెజ్‌ పనిచేస్తున్నారు.

ప్రమాదానికి కొద్దిసేపటి ముందు బాధితులు సరదాగా గడిపిన దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ADVERTISEMENT

వివరాలు 

చార్టర్‌ ఫ్లైట్‌గా హెలికాప్టర్

ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ లేడీ లోరీ హెలికాఫ్టర్స్‌ సంస్థకు చెందినదని అధికారులు తెలిపారు.

దీనిని చార్టర్‌ ఫ్లైట్‌గా నడుపుతున్నట్లు సంబంధిత సంస్థ వెల్లడించింది.

మౌంట్‌ ఒలోలోక్వే పర్వత పాద ప్రాంతంలోని అత్యంత క్లిష్టమైన భూభాగంలో హెలికాప్టర్‌ కూలిపోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకోవడం కూడా సవాలుగా మారడంతో కెన్యా రెడ్‌క్రాస్‌తో పాటు ఇతర సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.

ADVERTISEMENT

వివరాలు 

హెలికాప్టర్‌ ప్రమాదాలపై ఆందోళన

కెన్యాలో పర్యాటక రంగం విస్తృతంగా ఉండటంతో మారుమూల ప్రాంతాల్లోని సఫారీ ప్రాంతాలకు ప్రయాణికులను తరలించేందుకు హెలికాప్టర్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

అయితే ఇటీవల దేశంలో చోటుచేసుకుంటున్న వరుస హెలికాప్టర్‌ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరిలో పశ్చిమ కెన్యాలో జరిగిన మరో హెలికాప్టర్‌ ప్రమాదంలో ఓ ఎంపీ సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

తాజాగా జరిగిన ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కెన్యాలో విషాదం.. పర్వత ప్రాంతంలో హెలికాప్టర్‌ కూలి ఏడుగురు మృతి

ADVERTISEMENT