తదుపరి వార్తా కథనం

Kuwait: కువైట్ బిల్డింగ్ హౌసింగ్ కార్మికులలో అగ్ని ప్రమాదం.. 41 మంది మృతి
వ్రాసిన వారు
Stalin
Jun 12, 2024
05:12 pm
ఈ వార్తాకథనం ఏంటి
గల్ఫ్ దేశం కువైట్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు సహా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 37 మంది అస్వస్థతకు గురయ్యారని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో ఎక్కువమంది కేరళకు చెందిన వారు.కువైట్ లోని దక్షిణ మంగాఫ్ జిల్లాలో ఈ ఘోర అగ్నిప్రమాదం జరిగింది.
వివరాలు
రియల్ ఎస్టేట్ యజమానుల దురాశే, డిప్యూటీ పీఎం
రియల్ ఎస్టేట్ యజమానులు , దురాశకు పాల్పడ్డారని డిప్యూటీ పీఎంషేక్ ఫహద్ ఆరోపించారు.వారి దుర్ధుద్దే ఘటనకు కారణమన్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6:00 గంటలకు (0300 GMT) అగ్నిమాపక అధికారులకు సమాచారం అందిందని మేజర్ జనరల్ ఈద్ రషెద్ హమద్ తెలిపారు. 'ఈ ప్రమాదంలో చిక్కుకున్న చాలామందిని రక్షించారు, కానీ దురదృష్టవశాత్తు మంటల నుండి పొగ పీల్చడం వల్ల చాలా మంది మరణించారు'' అని సీనియర్ పోలీసు కమాండర్ చెప్పారు.