
Bangladesh: మాకు ఆశ్రయం ఇవ్వండి.. లేదంటే చంపేయండి'.. శరణార్థుల వేడుకోలు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దులో 500మంది పైగా శరణార్థులు భారతదేశంలో తమకు ప్రవేశాన్ని మంజూరు చేయాలని కోరుతున్నారు.
మాకు ఆశ్రమం ఇవ్వడం లేదంటే చంపేయండి అంటూ వేడుకుంటున్నారు.
ప్రస్తుతం శరణార్థులు నగర్ నదిని దాటి మనుషులు లేని ప్రాంతానికి చేరుకుంటారు.
2018లో రద్దు చేసిన ఉద్యోగ కోటా పథకాన్ని కోర్టు పునరుద్ధరించిన తర్వాత జూలై నుంచి బంగ్లాదేశ్ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నారు.
పరిస్థితి చేయి దాటడంతో ఆ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోయింది
Details
హిందు దేవాలయాలపై దాడులు
షేక్ హసీనా రాజీనామా మొదట్లో నిరసనకారులలో సంతోషాన్ని రేకెత్తించింది. అయితే హిందువులు, అవామీ లీగ్ సభ్యులతో సహా మైనారిటీలకు లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నారు.
సరిహద్దులో చిక్కుకున్న శరణార్థులు సరిహద్దు భద్రతా దళం (BSF)తో తమకు భారతదేశంలో ఆశ్రయం కల్పించండి లేదా ఇక్కడే చంపేయండి అంటూ వేడుకుంటున్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో బంగ్లాదేశ్ శరణార్థులు చిక్కుకున్నారు.
హిందువుల గృహాలు, హిందూ దేవాలయాల్లో నిరసనకారులు దాడులకు తెగబెడుతూ విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు.